విజయవాడలో రూ. 135 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం: జగన్ శంకుస్థాపన

By narsimha lode  |  First Published Mar 31, 2021, 10:58 AM IST

విజయవాడలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి  బుధవారం నాడు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. రూ. 125 కోట్ల వ్యయంతో రిటైనింగ్ వాల్ ను నిర్మించనున్నారు.ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణంతో కృష్ణలంక వాసులకు కష్టాలు తీరనున్నాయి.


విజయవాడ: విజయవాడలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి  బుధవారం నాడు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. రూ. 125 కోట్ల వ్యయంతో రిటైనింగ్ వాల్ ను నిర్మించనున్నారు.ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణంతో కృష్ణలంక వాసులకు కష్టాలు తీరనున్నాయి.

కృష్ణా నదికి వరదలు వచ్చిన సమయంలో  ఈ వాల్ లేకపోవడంతో స్థానికుల ఇళ్లు నీటిలో మునిగిపోతున్నాయి. దీంతో వరద నీరు కృష్ణ లంక వాసుల ఇళ్లలోకి చేరకుండా ఉండేందుకు గాను  ప్రభుత్వం ఈ వాల్ ను నిర్మిస్తోంది.

Latest Videos

undefined

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను అధికారులు సీఎం జగన్ కు వివరించారు.

కృష్ణా నదికి వరదలు వస్తే ఈ ప్రాంత ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని జీవనం సాగిస్తారు. ఎప్పుడూ కృష్ణా నీరు తమ ఇళ్లలోకి నీరు వచ్చి ఇళ్లు ఖాళీ చేయాల్సి వస్తోందని జనం ఇబ్బందులు పడేవారు. ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం వల్ల ముంపు ప్రాంతాల్లోకి నీరు రాకుండా వాల్ అడ్డుకొంటుంది.
 

click me!