ధర్మవరంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం స్కీమ్ ప్రారంభించిన జగన్

By narsimha lode  |  First Published Dec 21, 2019, 1:55 PM IST

ధర్బవరంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్ నేతన్న నేస్తం స్కీమ్ ను శనివారం నాడు ప్రారంభించారు.


ధర్మవరం: ప్రజల సంక్షేమం కోసం తాను ప్రయత్నాలు చేస్తోంటే తన శత్రువులు తనపై విమర్శలు చేస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలతో తాను ప్రజల కోసం పనిచేస్తానని ఆయన స్ఫష్టం చేశారు. 

Also read:నేతన్ననేస్తం ఈరోజే ఎందుకంటే...????
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ధర్మవరంలో  వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం జగన్ శనివారం నాడు ప్రారంభించారు.

Latest Videos

undefined

నేతన్నల కుటుంబాలు గౌరవంగా బతికేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా జగన్ చెప్పారు. ధర్మవరంలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకొంటే గత ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని ఆయన చెప్పారు. ధర్మవరంలో 51 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన చెప్పారు.

గత ప్రభుత్వం ఆప్కో వ్యవస్థను కుంభకోణాలుగా మార్చేసిందని వైఎస్ జగన్ ఆరోపించారు. కొన్ని రోజుల్లో ఆప్కోను ప్రక్షాళనచేస్తామని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.  నెలరోజుల్లోనే ఆప్కో పై వేసిన దర్యాప్తు ముగిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ధర్మవరం చేనేత కార్మికుల గురించి ప్రపంచం గొప్పగా చెప్పుకొంటున్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు.

గత ప్రభుత్వం ధర్మవరం చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాను గతంలో ఇక్కడే దీక్ష చేసిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. 

మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ప్రతి ఏటా రూ. 24 వేలను చెల్లించనున్నట్టుగా సీఎం జగన్ ప్రకటించారు. తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని వారికి  న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు. 

నేతన్నలకు ఇచ్చిన మాటను నిలుపుకొన్నట్టుగా జగన్ చెప్పారు.  పాదయాత్రలో కష్టాలను చూశాను, నేనున్నాను, నేను విన్నాను అని చెప్పాను వాటిని అమలు చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు.

బీసీలు అంటే సమాజానికి వెన్నెముక లాంటి కులాలు అని తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని  చెప్పారు. ఎన్నికలకు ముందు తాను ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు.

 

click me!