ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు: ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును ప్రారంభించిన జగన్

Published : Mar 25, 2021, 12:49 PM IST
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు: ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును ప్రారంభించిన జగన్

సారాంశం

కర్నూల్ జిల్లాలోని ఓర్వకల్లులో ఎయిర్ పోర్టును గురువారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్  ప్రారంభించారు.  ఈ ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నట్టుగా  సీఎం ప్రకటించారు.

కర్నూల్: కర్నూల్ జిల్లాలోని ఓర్వకల్లులో ఎయిర్ పోర్టును గురువారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్  ప్రారంభించారు.  ఈ ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నట్టుగా  సీఎం ప్రకటించారు.

ఈ సందర్భంగా సీఎం  ప్రసంగించారు. సిపాయి తిరుగుబాటు కంటే ముందే  రైతుల పక్షాన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి  పోరాటం చేశారని ఆయనన గుర్తు చేశారు.  ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్టుగా ఆయన చెప్పారు.

కర్నూల్ నుండి ప్రయాణం అంటే రోడ్డు, రైలు మార్గంలోనే జరిగేది.ఇక నుండి కర్నూల్ నుండి విమానాల ద్వారా ప్రయాణాలు సాగించవచ్చన్నారు.  ఈ నెల 28 నుండి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నట్టుగా సీఎం చెప్పారు. న్యాయ రాజధాని నుండి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుందని ఆయన చెప్పారు.

తొలుత బెంగుళూరు, చెన్నై, విశాఖపట్టణానికి విమానాలు నడిపించనున్నారని సీఎం చెప్పారు. ఒకేసారి ఈ విమానాశ్రయంలో నాలుగు విమానాలను పార్క్ చేసుకొనే సౌకర్యం ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఐదు విమానాశ్రయాలు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

పనులు ప్రారంభం కాకముందే ఎన్నికలకు నెల రోజుల ముందు చంద్రబాబునాయుడు ఈ ఎయిర్ పోర్టును ప్రారంభించారని  ఆయన విమర్శించారు. ఆస్ట్రియా నుండి దిగుమతి చేసుకొన్న రెండు అగ్నిమాపక శకటాలను అందుబాటులో ఉంచుతున్నట్టుగా చెప్పారు. 

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు మద్దతుగా పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీని గెలిపించారన్నారు. 1008 ఎకరాల్లో రూ. 153 కోట్లతో ఈ ఎయిర్ పోర్టును  నిర్మించారు.
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్