ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ను గురువారం నాడు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలవనున్నారు.
విశాఖపట్టణం: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ను గురువారం నాడు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలవనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ ను కలిసి గంటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేయనున్నారు.
రాజకీయ ఒత్తిడితోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయడం ద్వారానే రాజకీయ ఒత్తిడి పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
undefined
స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ విషయంలో మరో ఆలోచన లేదని కేంద్రం తేల్చి చెప్పింది.ప్రైవేటీకరణ కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. పలు సూచనలను చేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధానమంత్రి మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడాన్ని ఏపీ ప్రభుత్వం కూడ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇనుప ఖనిజం గనులను కేటాయించాలని కూడ ప్రభుత్వం కోరింది. రాష్ట్రానికి చెందిన అఖిలపక్షాల నేతలు, కార్మిక సంఘాలతో వస్తానని అపాయింట్ మెంట్ ఇవ్వాలని మోడీని ఏపీ సీఎం కోరారు.