బ్రేకింగ్ : సీఎం వైఎస్ జగన్ కుప్పం పర్యటన వాయిదా

By Siva KodatiFirst Published Sep 20, 2022, 6:53 PM IST
Highlights

ఎల్లుండి జరగాల్సిన ఏపీ సీఎం వైఎస్ జగన్ కుప్పం పర్యటన అనివార్య కారణాల వల్ల శుక్రవారానికి వాయిదా పడింది. కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే వైఎస్సార్ చేయూత పథకానికి సంబంధించిన నగదును కూడా అక్కడే విడుదల చేయనున్నారు. 

ఎల్లుండి జరగాల్సిన ఏపీ సీఎం వైఎస్ జగన్ కుప్పం పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. దీనిని శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే షెడ్యూల్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని తెలిపింది. కాగా.. కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే వైఎస్సార్ చేయూత పథకానికి సంబంధించిన నగదును కూడా అక్కడే విడుదల చేయనున్నారు. 

ALso REad:నారావారిపల్లెలో స్కూల్‌ని కూడా పట్టించుకోలేదు.. వైసీపీ వచ్చాకే : చంద్రబాబుపై మండిపడ్డ జగన్‌

అలాగే కుప్పంలో రోడ్ షో నిర్వహించి.. టీడీపీకి గట్టి పోటీ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా కీలక నేతలు ఏర్పాట్లలో నిమగ్నమై వున్నారు. టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడికి కంచుకోటగా వున్న కుప్పంలో ఈసారి వైసీపీ జెండా ఎగురవేయాలని జగన్ భావిస్తున్నారు. 

షెల్యూల్డ్ ఇదే :

ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. సీఎం వైఎస్ జగన్ గురువారం ఉదయం 9.15 నిమిషాలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి 10.45 గంటలకు కుప్పానికి చేరుకుంటారు. 11.15 నుంచి 12.45 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చేయూత పథకం కింద మూడో విడత నిధులను విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3.10 నిమిషాలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు జగన్. 
 

click me!