కారణం లేకుండా ఎవరికీ టిక్కెట్టు నిరాకరించను: గడప గడపకు వర్క్ షాప్ లో జగన్

By narsimha lode  |  First Published Apr 3, 2023, 5:40 PM IST

కారణం లేకుండా  ఎవరికీ  కూడా ఎమ్మెల్యే  టిక్కెట్టు నిరాకరించబోనని  ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు. 


అమరావతి: కారణం లేకుండా  ఎవరికి  కూడా  ఎమ్మెల్యే  టిక్కెట్టు  నిరాకరించనని  ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు. 

సోమవారంనాడు   గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై  ఏపీ సీఎం వైఎస్ జగన్  సమీక్ష  నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో  సీఎం జగన్   కొన్ని కీలక వ్యాఖ్యలు  చేశారు. టిక్కెట్టు  నిరాకరించడం  వెనుక కారణాలుంటాయని  సీఎం జగన్  చెప్పారు. ఎమ్మెల్యే  టిక్కెట్టు  నిరాకరించిన వారికి  అవకాశాలు కల్పిస్తామని  ఏపీ సీఎం జగన్ హామీ ఇచ్చారు.  ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వకపోతే   ఎమ్మెల్సీ  పదవిని ఇస్తామన్నారు. లేదా  కార్పోరేషన్  చైర్మెన్లుగా  నియమిస్తామని  ఆయన  హామీ ఇచ్చారు. 

Latest Videos

2029 లో  నియోజకవర్గాల్లో  పునర్విభజన  జరుగుతుందని  సీఎం జగన్  చెప్పారు.   దీంతో  రాష్ట్రంలో  అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య  పెరిగే  అవకాశం ఉందన్నారు. 2029  లో   పెరిగిన  అసెంబ్లీ నియోజకవర్గాల్లో  అవకాశం కల్పిస్తామని  సీఎం జగన్ హామీ ఇచ్చారు. పెండింగ్ బిల్లులన్నీ  ఈ నెలలోనే  క్లియర్ చేస్తానని  సీఎం జగన్ హామీ ఇచ్చారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఓటేసినవారు మన  బటన్ బ్యాచ్ కాదని  సీఎం జగన్  పేర్కొన్నారు. గతంలో  జరిగిన  గడప గడపకు  మన ప్రభుత్వం  కార్యక్రమంలో  గ్రేడింగ్ ఇచ్చేవారు. కానీ ఇవాళ సమావేశంలో మాత్రం  గ్రేడింగ్  ఇవ్వలేదు.
 

click me!