
వైఎస్ఆర్ కడప జిల్లా (ysr kadapa district) వేంపల్లి జడ్పీ స్కూల్‌లో విద్యార్ధులతో సీఎం జగన్ (Ys jagan) గురువారం ముఖాముఖీ నిర్వహించారు. అంతకుముందు రూ.15 కోట్లతో నిర్మించిన వేంపల్లి జెడ్పీ పాఠశాలను ఆయన ప్రారంభించారు. అనంతరం నాడు - నేడులో భాగంగా స్కూల్ రూపు రేఖలు ఎలా మారాయో విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు సీఎం చూపించారు. బాగా చదువుకోవాలని ఆయన పిల్లలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. గొప్పగా చదివి , ప్రపంచంతో పోటీపడాలని జగన్ సూచించారు.
ఇకపోతే.. సొంత జిల్లా పర్యటనలో భాగంగా గురువారం Pulivendula ఏపీ కార్ల్‌లో న్యూటెక్ బయో సైన్స్ కు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జగన్ ప్రసంగించారు. ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. ప్రకృతి వ్యవసాయం ఈ రోజుల్లో ఎంతో ఉపయోగపడనుందన్నారు. Chemichalలతో కూడిన ఆహారంతో అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందని సీఎం జగన్ చెప్పారు. అనేక రకాల క్యాన్సర్లకు రసాయనాలతో పండించిన పంటలు కూడా కారణమన్నారు. ఆహార ఉత్పత్తుల్లో రసాయనాలను తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రకృతి వ్యవసాయంపై గరామస్థాయి నుండి శిక్షణ ఇస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.
ALso REad:ప్రకృతి వ్యవసాయంపై ఆర్‌బీకేలతో శిక్షణ: పులివెందులలో వైఎస్ జగన్
Farmers పెట్టుబడి వ్యయాన్ని తగ్గించేందుకు పలు చర్యలు తీసుకొంటున్నట్టుగా సీఎం వివరించారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను అభివృద్ది చేసేందుకు అనేక పథకాలను ప్రారంభిస్తున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో ఆరు లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రకృతి వ్యవసాయంపై అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం చేసుకున్నామని సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్ బీ కే కేంద్రాలు విత్తనం నుండి నాటే ప్రక్రియ నుండి రైతులను చేయి పట్టుకుని నడిపిస్తున్నాయన్నారు. ఈ సంస్థల ద్వారా రైతులకు అవసరమైన శిక్షణ ఇస్తున్నామన్నారు. పంట కొనుగోలు వరకు కూడా ఆర్ బీ కే కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయన్నారు.ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు తొలి ఏడాదిలో ఆదాయం తగ్గొచ్చన్నారు. ప్రకృతి వ్యవసాయంలో రైతుకు పెట్టుబడి కూడా బాగా తగ్గనుందని సీఎం జగన్ చెప్పారు. భూమిలో సారం పెరగడం వల్ల ఉత్పత్తి కూడా పెరగనుందన్నారు. వ్యవసాయ శాస్ర్తవేత్తలు గ్రామాలపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జగన్ నొక్కి చెప్పారు.