బెల్ట్ షాపులపై సీఎం జగన్ ఉక్కుపాదం

By Nagaraju penumalaFirst Published Jun 4, 2019, 8:03 PM IST
Highlights

ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎంకే మీనా బెల్ట్ షాపులపై కొరడా ఝులిపించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అమరావతిలో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశమైన ఎంకే మీనా బెల్ట్ సాపుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాంబశివరావు సైతం హాజరయ్యారు. 

అమరావతి: ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల సాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో విడతలవారీగా మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన వైయస్ జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. 

అందులో భాగంగా 
ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనకు కార్యాచరణ సిద్దం చేస్తోంది ఎక్సైజ్ శాఖ. ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎంకే మీనా బెల్ట్ షాపులపై కొరడా ఝులిపించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అమరావతిలో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశమైన ఎంకే మీనా బెల్ట్ సాపుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. 

ఈ సమావేశానికి రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాంబశివరావు సైతం హాజరయ్యారు. బుధవారం నుంచే బెల్ట్ షాపుల నియంత్రణకు కార్యచరణ మెుదలుపెట్టాలని సూచించారు. బెల్ట్ షాపుల నియంత్రణ చర్యలపై ప్రతీరోజూ స్టేషన్ల వారీగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. 

గ్రామానికొక కానిస్టేబుల్, మండలానికి ఒక ఎక్సైజ్ ఎస్సై లను బాధ్యులుగా చేస్తూ బెల్ట్ షాపుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. బెల్ట్ షాపుల నియంత్రణలో చక్కటి పనితీరు కనబరచిన సిబ్బందికి రివార్డులు ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే గంజాయి రవాణాను అరికట్టే విషయంలోనూ ప్రత్యేకంగా చొరవచూపాలని కమిషనర్ ఎంకే మీనా అధికారులను ఆదేశించారు. 

click me!