ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ

Published : Jun 04, 2019, 06:11 PM IST
ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ

సారాంశం

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మంగళవారం నాడు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో  ఘోరంగా ఓటమి పాలు కావడం, పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలపై చంద్రబాబు పార్టీ నేతలతో సమీక్షించనున్నారు.

అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మంగళవారం నాడు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో  ఘోరంగా ఓటమి పాలు కావడం, పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలపై చంద్రబాబు పార్టీ నేతలతో సమీక్షించనున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైంది. క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసే విషయమై పార్టీని బలోపేతం చేసే విషయమై పార్టీ నేతలతో బాబు చర్చిస్తున్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలపై కూడ చర్చించే అవకాశం లేకపోలేదు.

మరో వైపు ఈ నెల 7వ తేదీ నుండి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వారం రోజుల పాటు కుటుంబసభ్యులతో చంద్రబాబు విదేశాల్లో గడుపుతారు. ఈ నెల 14 వ తేదీన బాబు ఇండియాకు తిరిగి వస్తారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu