ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీ

By Nagaraju penumalaFirst Published Jun 4, 2019, 7:41 PM IST
Highlights

సీఎంలో తన టీం ను నియమించుకున్న సీఎం వైయస్ జగన్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై దృష్టిసారించారు. 22మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ఏపీ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యఆరోగ్యశాఖ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న పూనం మాలకొండయ్యను వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన టీమ్ పై పూర్తి కసరత్తు చేశారు. ఇప్పటికే డీజీపీ, సీఎస్ స్థాయి నుంచి సీఎంవో వరకు అన్ని శాఖల్లోతన టీం ను నియమించుకున్నారు సీఎం వైయస్ జగన్. 

సీఎంలో తన టీం ను నియమించుకున్న సీఎం వైయస్ జగన్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై దృష్టిసారించారు. 36మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ఏపీ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో తొమ్మిది మంది కలెక్టర్లు ఉన్నారు. అయితే కృష్ణా, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కలెక్టర్లపై బదిలీ వేయలేదు ప్రభుత్వం. 

ఊహించినట్లుగానే వైద్యఆరోగ్యశాఖ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్యపై బదిలీ వేటు పడింది. పూనం మాలకొండయ్యను వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆమెను  బదిలీ చేశారు. వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కేఎస్ జవహర్ ను నియమించింది. 

అలాగే మున్సిపల్ శాఖ స్పెషల్ సెక్రటరీ కరికాల వలన్ ను బీసీ సంక్షేమ శాఖకు బదిలీ చేసింది. ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీగా ఉన్న పి.లక్ష్మీనరసింహంను బదిలీ చేశారు. ఆయనను సీఆర్డీఏ కమిషనర్ గా నియమించింది. 

విశాఖపట్నం కలెక్టర్ కాటమనేని భాస్కర్ పై బదిలీ వేటు పడింది. కాటమనేని భాస్కర్ ను యూత్ అఫైర్స్, టూరిజం డవలప్ మెంట్ ఎండీగా నియమించింది. ప్రస్తుతం ఆశాఖ ఎండీగగా పనిచేస్తున్న ఎంవీ శేషగిరి బాబును బదిలీ చేసింది. ఇకపోతే చిత్తూరు కలెక్టర్ గా ఉన్న పీఎస్ ప్రద్యుమ్నపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. ఆయనను మార్కెటింగ్ శాఖ స్పెషల్ కమిషనర్ గా నియమించింది.  
మరోవైపు పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న ఎం.గిరిజాశంకర్ కు అవకాశం కల్పించింది. పంచాయితీరాజ్, రూరల్ డవలప్ మెంట్ కమిషనర్ గా నియమించింది. ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఎంఎం నాయక్ ను కూడా బదిలీ చేసింది. ఎంఎం నాయక్ ను ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా నియమించింది. 

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా ఉన్న ప్రవీణ్ కుమార్ పై బదిలీవేటు పడింది. ఆయనను వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ గా నియమించింది. అలాగే కోపరేషన్, కోపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న జే మురళీని సీఎం ఓస్డీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న కె. విజయను ట్రాన్స్ ఫర్ చేశారు. ఆమెను సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ గా నియమించింది. 

పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న పి.సీతారామ ఆంజనేయులును ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా నియమించింది. ఇకపోతే హార్టికల్చర్ ఎక్స్ అఫిసియో సెక్రటరీగా ఉన్న  చిరంజీవి చౌదరిని హార్టికల్చర్, సెరీకల్చర్ కమిషనర్ గా నియమించింది.  

అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న పీయూష్ కుమార్ ను కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గా బదిలీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేసన్ ఎండీగా పనిచేస్తున్న కాంతిలాల్ దండేపై బదిలీవేటు పడింది. 
ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ గా కాంతిలాల్ దండేను నియమించింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా పనిచేస్తున్న ఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ పై బదిలీవేటు వేసింది. ఆయనను పురపాలక శాఖ కమిషనర్ గా నియమించింది. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న కె హర్ష వర్తన్ ను సాంఘీక సంక్షేమశాఖ డైరెక్టర్ గా నియమించింది.  

ఇకపోతే వాణిజ్య రాజధాని విశాఖపట్నం కలెక్టర్ కాటమనేని భాస్కర్ పై కూడా బదిలీ వేటు పడింది. ఆయనను టూరిజం శాఖ ఎండీగా బదిలీ చేసింది ప్రభుత్వం. ఇకపోతే విశాఖపట్నం కలెక్టర్ గా వి.వినయ్ చంద్
 ను నియమించింది. అటు నెల్లూరు జిల్లా కలెక్టర్ గా ఎంవీ శేషగిరిరావును నియమించింది. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా రేవు ముత్యాలరాజును నియమించింది. 

వీరితోపాటు కర్నూలు జిల్లా కలెక్టర్ గా జి.వీరపాండ్యన్,  చిత్తూరు జిల్లా కలెక్టర్ గా నారాయణ భగత్ గుప్తా లను నియమించింది. ఇకపోతే గుంటూరు జిల్లా కలెక్టర్ గా శ్యామ్యూల్ ఆనంద్, 
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా మురళీధర్ రెడ్డి లను నియమించింది. అనంతపురం కలెక్టర్ గా ఎస్.సత్యనారాయణను నియమించింది ఏపీ సర్కార్. 

తొమ్మిది జిల్లాలకు నియమితులైన కొత్త కలెక్టర్లు వీరే...

వ.నెం.         జిల్లా                          కలెక్టర్ 
1.               విశాఖపట్నం             వి.వినయ్ చంద్

2.               నెల్లూరు                    ఎంవీ శేషగిరిరావు

3.               పశ్చిమగోదావరి          ఆర్. ముత్యాలరాజు 

4.             కర్నూలు                   జి.వీరపాండ్యన్
5.             చిత్తూరు                     నారాయణ భగత్ గుప్తా  
6.              గుంటూరు                    శ్యామ్యూల్ ఆనంద్ 
7.             తూర్పుగోదావరి             మురళీధర్ రెడ్డి
8.             అనంతపురం                 ఎస్.సత్యనారాయణ
 9.            ప్రకాశం                          పి.భాస్కర్

 

click me!