మనకు చెడ్డపేరు తెచ్చేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు: స్పందన రివ్యూలో సీఎం జగన్

Published : Aug 27, 2019, 03:02 PM ISTUpdated : Aug 27, 2019, 03:07 PM IST
మనకు చెడ్డపేరు తెచ్చేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు: స్పందన రివ్యూలో సీఎం జగన్

సారాంశం

సెప్లెంబర్ 5న నూతన ఇసుక పాలసీని అమల్లోకి తీసుకు రాబోతున్నట్లు తెలిపారు.ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేట్లు కన్నా తక్కువ రేట్లకు ఇసుకను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఇసుక సప్లై పెంచాలని లేకపోతే రేట్లు తగ్గే పరిస్థితి ఉండదన్నారు.

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చేలా కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు సీఎం జగన్. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే చూడలేక బాధపడేవాళ్లు ఇలాంటి చర్యలకు దిగజారుతున్నారని విమర్శించారు. 

అలాంటి వారి కుట్రలను చేధించాలని ఆదేశించారు. నూతన ఇసుకపాలసీపై చర్చిస్తున్న సమయంలో జగన్ ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్లెంబర్ 5న నూతన ఇసుక పాలసీని అమల్లోకి తీసుకు రాబోతున్నట్లు తెలిపారు. 

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేట్లు కన్నా తక్కువ రేట్లకు ఇసుకను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఇసుక సప్లై పెంచాలని లేకపోతే రేట్లు తగ్గే పరిస్థితి ఉండదన్నారు. ఇప్పటికే గుర్తించిన స్టాక్ యార్డుల్లో ఇసుకను నింపడం మెుదలుపెట్టాలని ఆదేశించారు.  

అవకాకాశం ఉన్న ప్రతిచోటా రీచ్‌లను ఏర్పాటు చేయాలన సూచించారు. వరదల వల్ల కొత్త రీచ్‌లు పెట్టే అవకాశం వచ్చిందని అధికారులు చెప్పడంతో ప్రకృతికి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా వీలున్నచోట కొత్త రీచ్ లు తీసుకురండి అంటూ సూచించారు. రవాణాలో ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. 

ఇసుకరీచ్ లను ఎక్కువ మందికి ఇవ్వాలని ఆదేశించారు. ఇసుక సరఫరా అంశంలో ఎవరూ తప్పులు చేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురాకుండా చూడాలని జగన్ అధికారులను హెచ్చరించారు.   

ఈ వార్తలు కూడా చదవండి

ప్రభుత్వ పథకాల అమలుకు జగన్ ముహూర్తం: అక్టోబర్ 15న రైతు భరోసా, జనవరి 26న అమ్మఒడి

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!