పార్టీ ఫిరాయింపులపై చట్టంలో స్పష్టత లేదు: వెంకయ్య

By narsimha lodeFirst Published Aug 27, 2019, 2:26 PM IST
Highlights

పార్టీ ఫిరాయింపులపై  ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ చట్టంపై స్పష్టత  ఇంకా రావాల్సిన అవసరం ఉందన్నారు.


అమరావతి: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ప్రజాప్రతినిధులపై నిర్ధిష్ట సమయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మంగళవారం నాడు ఆయన అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ పిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

పార్టీ ఫిరాయించిన వారిపై స్పీకర్ చర్యలు తీసుకోకపోతే ఏం చేయాలనే విషయమై చట్టంలో చెప్పలేదన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై  చర్యలకు నిర్ధిష్ట సమయం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మంత్రులయ్యారని ఆయన గుర్తు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఇప్పటివరకు  చర్యలు తీసుకోలేదన్నారు. రాజ్యసభలో ఇప్పటివరకు 16 దఫాలు విలీనం పేరుతో కలిసిపోయారని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు.

click me!