ప్రభుత్వ పథకాల అమలుకు జగన్ ముహూర్తం: అక్టోబర్ 15న రైతు భరోసా, జనవరి 26న అమ్మఒడి

By Nagaraju penumalaFirst Published Aug 27, 2019, 2:46 PM IST
Highlights

బ్యాంకు ఖాతాలను తెరవడానికి ఆయా జిల్లా కలెక్టర్లు బ్యాంకర్లతో సమావేశం కావాలని ఏవైనా సమస్యలు ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ప్రభుత్వం పథకం నుంచి అందే ఏ డబ్బు అయినా నేరుగా లబ్ధిదారులకే చేరాలని స్పష్టం చేశారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ప్రారంభోత్సవానికి సీఎం జగన్ ముహూర్తం ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలతోపాటు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నిర్ణయించారు. 

అందులో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ తేదీలను సీఎం జగన్ వెల్లడించారు. అక్టోబర్ 15న రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే జనవరి 26న ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. 

ఇకపోతే సెప్టెంబర్ చివరి వారంలో సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకుంటున్న వారికి నెలకు రూ.10వేలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక చేపట్టాల్సి ఉందని అందువల్ల త్వరలోనే ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేస్తానని చెప్పుకొచ్చారు. 


ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే ఏ డబ్బు అయినా ఆడబ్బు పాత అప్పులకు జమకాకుండా అన్‌ ఇన్‌కంబర్డ్‌ బ్యాంకు ఖాతాలు ఓపెన్‌ చేయించాలని ఆదేశించారు. అందుకు సంబంధించి బ్యాంకర్లతో ఉన్నతస్థాయిలో మాట్లాడుతున్నట్లు తెలిపారు. 

ఆటోనడుపుకుంటున్న లబ్ధిదారులను ఎంపిక చేయడమే కాకుండా, వాలంటీర్లు ఈబ్యాంకు ఖాతాలను తెరవడంపైన కూడా ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు. డబ్బు జమకాగానే ఈరశీదులను లబ్ధిదారులకు అందించాలని సూచించారు. 

బ్యాంకు ఖాతాలను తెరవడానికి ఆయా జిల్లా కలెక్టర్లు బ్యాంకర్లతో సమావేశం కావాలని ఏవైనా సమస్యలు ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ప్రభుత్వం పథకం నుంచి అందే ఏ డబ్బు అయినా నేరుగా లబ్ధిదారులకే చేరాలని స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం చెప్పినట్లు గుర్తు చేశారు. ఢిల్లీలో జరిగిన సదస్సులో నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారని చెప్పుకొచ్చారు.  

అలాగే నవంబర్ 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు సంతృప్తికర స్థాయిలో పడవులు ఉన్నా, బోట్లు ఉన్నా రూ.10వేలు చొప్పున ఇవ్వబోతున్నట్లు తెలిపారు.  

ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ పథకం తీసుకువచ్చినట్లు చెప్పుకొచ్చారు. సముద్రంలో వేట నిషేధ సమయం జూన్ లో ముగిసినా ప్రపంచ మత్స్యదినోత్సవం సందర్భంగా నవంబర్ లోనే ఇవ్వబోతున్నట్లు తెలిపారు.  

సబ్సిడీ కింద డీజిల్ అందివ్వనున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించి పెట్రోల్ బంకులను ఎంపిక చేయబోతున్నట్లు తెలిపారు. ఆ పెట్రోల్ బంకుల జాబితాను మత్స్యకారులకు అందజేస్తామని తెలిపారు. ప్రస్తుతం లీటర్ డీజిల్ పై రూ.6లు సబ్సిడీ ఇస్తున్నారని దాన్ని రూ.9కు పెంచబోతున్నట్లు తెలిపారు. 


చేనేత కార్మికులను ఆదుకునేందుకు డిసెంబర్ 21న సరికొత్త కార్యక్రమం తీసుకురాబోతున్నట్లు తెలిపారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24వేలు ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలో భాగంగా ప్రతీ కుటుంబానికి డబ్బులు చెల్లిస్తామని తెలిపారు.  

మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి రూ.24వేలు చేతిలో పెట్టబోతున్నట్లు తెలిపారు. 
ఈ పథకం అమలుపైనా దృష్టిపెట్టాలని ఆదేశించారు. 

జిల్లా కలెక్టర్లు అధికార యంత్రాంగం లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. 

ఇకపోతే వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి పథకాన్ని జనవరి 26న ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఇకపోతే 
ఫిబ్రవరి చివరి వారంలో దుకాణాలు ఉన్న నాయీ బ్రాహ్మణులకు, షాపులున్న టైలర్లకు, షాపులున్న రజకులకు రూ.10వేలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. 

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తెలిపారు. అదే ఫిబ్రవరి చివరి వారంలోనే వైయస్సార్‌ పెళ్లికానుక పథకాన్ని కూడా అమలులోకి తీసుకురావబోతున్నట్లు స్పష్టం చేశారు. 
ప్రస్తుతం ఉన్న మొత్తాన్ని పెంచి వైయస్సార్‌ పెళ్లికానుకను అందిచనున్నట్లు తెలిపారు.  

ఇకపోతే మార్చి చివరి వారంలో ధూప, దీప నైవేధ్యాలకు సంబంధించి, అలాగే మసీదులకు సంబంధించి ఇమామం, మౌజంలకు, అలాగే చర్చిలకు సంబంధించి పాస్టర్లకు సంబంధించి కొన్ని హామీలు ఇచ్చామని అందులో భాగంగా వారికి జీతాలు చెల్లిస్తామన్నారు. ఉగాది కానుకగా రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి ఇళ్లపట్టాలు అందివ్వబోతున్నట్లు తెలిపారు.  

click me!