భరత్‌ను గెలిపిస్తే.. మంత్రిగా పంపిస్తా : కుప్పం వైసీపీ కార్యకర్తలతో జగన్

By Siva KodatiFirst Published Aug 4, 2022, 10:16 PM IST
Highlights

కుప్పంలో భరత్‌ను గెలిపిస్తే మంత్రిగా పంపిస్తానన్నారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్. గురువారం కుప్పం నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలతో ఆయన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. చంద్రబాబు హయాంలో కన్నా.. ఈ మూడేళ్లలోనే కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగిందని జగన్ తెలిపారు. 

కుప్పం నియోజకవర్గానికి (kuppam assembly constituency) చెందిన వైసీపీ (ysrcp) కార్యకర్తలతో గురువారం ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలతో సమావేశాన్ని కుప్పంనుంచే ప్రారంభిస్తున్నామన్నారు. కుప్పంలో బీసీలు అత్యధిక సంఖ్యలో వున్నారని జగన్ చెప్పారు. గత ఎన్నికల్లో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్‌ అధికారి చంద్రమౌళిని అభ్యర్థిగా పెట్టామని సీఎం గుర్తుచేశారు. దురదృష్టవశాత్తూ చంద్రమౌళి మనకు దూరమయ్యారన్న జగన్ అంతటితో ఆ కుటుంబాన్ని వదిలేయకుండా.. ఆయన కుమారుడు భరత్‌ను (bharat) తీసుకువచ్చామన్నారు. 

భరత్‌ను ఇదే స్థానంలో నిలబెడతారా? లేదా భరత్‌ను మరింత పై స్థానంలోకి తీసుకు వెళ్తారా? అన్నది మీ మీద ఆధారపడి ఉందని జగన్ పేర్కొన్నారు. భరత్‌ను గెలుపించుకు వస్తే.. మంత్రిగా కుప్పానికి ఇస్తానని సీఎం హామీ ఇచ్చారు. చంద్రబాబు (chandrababu naidu) గెలుస్తారు కుప్పం అభివృద్ధి చెందుతుందని ఇన్నేళ్లు మోసం చేశారని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో కన్నా.. ఈ మూడేళ్లలోనే కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగిందని జగన్ తెలిపారు. 

Also REad:ఎంపీ గోరంట్ల మాధవ్ తప్పున్నట్లు తేలితే .. చర్యలు తప్పవు : తేల్చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి

స్కూళ్లలో నాడు –నేడు, ఇళ్ల పట్టాలు, ఆస్పత్రుల్లో నాడు–నేడు, ఇక ప్రతి గ్రామంలోనూ సచివాలయం, విలేజ్‌ క్లినిక్, ఆర్బీకే.. ఇవన్నీ గతంలో ఏ గ్రామంలోనూ కనిపించలేదని సీఎం ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి జరిగిందని.. వచ్చే రెండ్రోజుల్లో కుప్పం మున్సిపాల్టీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనులను మంజూరు చేస్తున్నట్లు జగన్ తెలిపారు. కుప్పం నియోజకవర్గాన్ని తన నియోజకవర్గంగానే చూస్తానని సీఎం వెల్లడించారు. ఇవాళ కాలర్‌ ఎగరేసుకుని... మనం గర్వంగా ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. 175కి 175 సీట్లు గెలిచే వాతావరణం కుప్పం నుంచే ప్రారంభం కావాలని జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యకర్తలకు అన్నిరకాలుగా తోడుగా నిలుస్తామని సీఎం హామీ ఇచ్చారు. 
 

click me!