బెజవాడలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

By narsimha lodeFirst Published Sep 2, 2019, 7:36 PM IST
Highlights

విజయవాడలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. వైఎస్ వర్థంతి సందర్భంగా నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కంట్రోల్ రూమ్ సమీపంలోని ప్రగతి పార్క్‌ని డాక్టర్ వైఎస్సార్ పార్క్‌గా సీఎం నామకరణం చేశారు.

విజయవాడలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. వైఎస్ వర్థంతి సందర్భంగా నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం కంట్రోల్ రూమ్ సమీపంలోని ప్రగతి పార్క్‌ని డాక్టర్ వైఎస్సార్ పార్క్‌గా సీఎం నామకరణం చేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.

దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కాగా.. 2011లో పోలవరం ప్రాజెక్ట్‌ ప్రతిమపై అభివాదం చేస్తున్నట్లుగా ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కంట్రోల్ రూమ్ వద్ద ఏర్పాటు చేశారు.

అయితే పుష్కరాల సమయంలో 2016 జూలై 31వ తేదీ అర్ధరాత్రి అప్పటి టీడీపీ ప్రభుత్వం తొలగించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం అనుమతులతో తిరిగా వైఎస్ విగ్రహాన్ని పున: ప్రతిష్టించారు. 

click me!