జ్యూడీషియల్ కమిషన్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం: ప్రతీ టెండర్ ప్రజల ముందుకేనన్న సీఎం జగన్

By Nagaraju penumalaFirst Published Jul 26, 2019, 5:26 PM IST
Highlights

రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు సంబంధించిన టెండర్ ను మెుదట ప్రజల ఎదుట పెడతామని జగన్ తెలిపారు. వారం రోజుల తర్వాత టెండర్ వివరాలు జడ్జ్ ముందుకు వెళ్తాయి అని చెప్పుకొచ్చారు. జడ్జి సిఫారసులు సంబంధిత శాఖ పాటించేలా నిబంధనలు తీసుకురాబోతున్నట్లు చెప్పుకొచ్చారు. మెుత్తం 15 రోజుల్లో టెండర్ ప్రతిపాదన ఖరారవుతుందని జగన్ స్పష్టం చేశారు.  

అమరావతి: రాష్ట్ర పాలనలో ఎలాంటి అవినీతికి తావు ఇవ్వకుండా ఉండాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీలో జ్యుడీషియల్ కమిషన్ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడిన సీఎం జగన్ పారదర్శక పాలనకు ఏపీ వేదిక కానుందని తెలిపారు. 

అవినీతిని నిర్మూలించి పారదర్శకత తీసుకురావాలనే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. హైకోర్టు జడ్జ్ లేదా రిటైర్డ్ జడ్జ్ ఆధ్వర్యంలో కమిషన్ వేస్తామని తెలిపారు. రూ.100 కోట్లకు పైబడిన టెండర్ ఏదైనా జడ్జ్ పరిధిలోకి వస్తుందని క్లారిటీ ఇచ్చారు. 

click me!