కర్నూలులో కన్నుల పండువగగా శ్రీగిరి దసరా మహోత్సవాలు

Published : Oct 04, 2019, 11:35 AM ISTUpdated : Oct 04, 2019, 11:38 AM IST
కర్నూలులో కన్నుల పండువగగా శ్రీగిరి దసరా మహోత్సవాలు

సారాంశం

కర్నూలు జిల్లాలో శ్రీగిరి దసరా మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు భ్రమరాంబ దేవి స్కంద మాత అలంకారంలో దర్శనం ఇచ్చారు.   

కర్నూలు: కర్నూలు జిల్లాలో శ్రీగిరి దసరా మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు భ్రమరాంబ దేవి స్కంద మాత అలంకారంలో దర్శనం ఇచ్చారు. 

గురువారం భ్రమరాంబ దేవికి స్కంద మాత అలంకారము, మల్లికార్జున స్వామి వారికి శేష వాహనసేవ నిర్వహించారు ఆలయ నిర్వాహకులు. ఆదిపరాశక్తిలో ఒకరైన స్కంద మాతదేవి ఐదో రూపం స్కందమాత. 

దేవి సింహవాహినిపై కుడివైపు ఓడిలో బాలుని రూపంలో షణ్ముఖుడు డైన కుమారస్వామిపై రెండు చేతులలో పద్మాలు ఎడమవైపు అభయహస్తంని కలిగి భక్తులకు దర్శనమిచ్చారు. స్కంధ మాత దేవిని దర్శించి పూజిస్తే ఇష్టకామ్యలు నెరవేరుతాయని దేవి భాగవతం చెప్తోంది. 

ఇకపోతే రోజు వారి ఉత్సవ క్రతువుల్లో చండీశ్వర పూజ మండపారాధన మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం రుద్రహోమం రుద్రయ్య గంగ జపాలు పారాయణాలు శ్రీచక్రార్చన నవావరణ అర్చన విశేషం కుంకుమార్చన మండపారాధన పంచాక్షరీ నిర్వహించారు.  

మెమరీ బాల జపానుస్థానాలు చతుర్వేద పారాయణం కుమారి పూజ చండీ హోమము చతుర్వేద పారాయణం కుమారి పూజ చండీ హోమము సహస్రనామార్చన  సాయంకాలం పూజలు రుద్ర చండిహోమాలు, కాలరాత్రి పూజ మంత్రపుష్పం ఆస్థాన సేవ సుహాసిని పూజ తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ నిర్వాహకులు. 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?