రైతును రాజును చేయడమే మా లక్ష్యం, అందుకే ఆ నిర్ణయం: సీఎం వైయస్ జగన్

Published : Jul 26, 2019, 02:53 PM IST
రైతును రాజును చేయడమే మా లక్ష్యం, అందుకే ఆ నిర్ణయం: సీఎం వైయస్ జగన్

సారాంశం

మార్కెట్ బిల్లు 2019 బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ప్రసంగించిన సీఎం జగన్ రైతులకు గిట్టుబాటు ధర ప్రభుత్వం దృష్టికి నేరుగా తీసుకెళ్లేందుకే ఎమ్మెల్యేలను మార్కెటింగ్ కమిటీలకు గౌరవ చైర్మన్లుగా నియమించినట్లు స్పష్టం చేశారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతన్నను రాజును చేయడమే వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. మార్కెట్ బిల్లు 2019 బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ప్రసంగించిన సీఎం జగన్ రైతులకు గిట్టుబాటు ధర ప్రభుత్వం దృష్టికి నేరుగా తీసుకెళ్లేందుకే ఎమ్మెల్యేలను మార్కెటింగ్ కమిటీలకు గౌరవ చైర్మన్లుగా నియమించినట్లు స్పష్టం చేశారు. 

పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించకపోయినా, లభించకపోయినా, ఒకవేళ ఎక్కడైనా అమలుకాలేకపోయినా ఆ విషయం ఎమ్మెల్యేకు తెలిసి అసెంబ్లీ సమావేశంలో చర్చిస్తారని తెలిపారు. 

ఇప్పటికే ధరల స్థిరీకరణ పథకం కింద ఇప్పటికే రూ.3000 కోట్లు కేటాయించామని రైతులకు గిట్టుబాటు ధర కల్పించి తీరుతామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో రైతన్నకు లాభం వచ్చేలా ఇచ్చేలా తమ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.   

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్