సతీవియోగం... ఏబీఎన్ రాధాకృష్ణ కుటుంబానికి సీఎం జగన్ సానుభూతి

Arun Kumar P   | Asianet News
Published : Apr 27, 2021, 07:34 PM ISTUpdated : Apr 27, 2021, 07:41 PM IST
సతీవియోగం... ఏబీఎన్ రాధాకృష్ణ కుటుంబానికి సీఎం జగన్ సానుభూతి

సారాంశం

ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ (63) మరణంపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కనకదుర్గ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. 

అమరావతి: ఏబీన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం జరిగింది.  ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ (63) మరణంపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కనకదుర్గ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. బాధలో వున్న రాధాకృష్ణకు, వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు సీఎం జగన్‌. 

కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేమూరి కనకదుర్గ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఇవాళమధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. 

రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ పార్థివదేహానికి చంద్రబాబు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. 

కనకదుర్గ మృతి పట్ల ఎంపీ రఘురామకృష్ణమ రాజు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల సీఎం రమేష్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, మాజీ సీఎల్పీ నాయకులు కుందూరు జానారెడ్డి కూడా కనకదుర్గ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కొద్దిరోజుల గా అనార్యోగం తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె  మృతి చెందడం బాధాకరమని ఆయన అన్నారు.

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి, ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ మృతి పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు సంతాపం ప్రకటించారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : టమాటా టార్గెట్ సెంచరీ..? మిర్చీ హాఫ్ సెంచరీ..? : హైదరాబాద్ లో ఏ కూరగాయ ధర ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : చలి తగ్గినా ఈ ప్రమాదం ఇంకా పొంచివుంది.. తస్మాత్ జాగ్రత్త