సంగం డెయిరీ కేసు: హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

By Siva KodatiFirst Published Apr 27, 2021, 7:25 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కించిన సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కించిన సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

అయితే తనపై ఏసీబీ నమోదు చేసిన అభియోగాలపై హైకోర్టులో దూళిపాళ్ల క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధూళిపాళ్ల, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వారి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పును రిజర్వ్‌ చేసింది.   

అంతకుముందు సంగం డెయిరీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెయిరీ యాజమాన్యం, నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంది. డెయిరీ బాధ్యతను గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:నరేంద్రకు ఏపీ సర్కార్ షాక్: సంగం డెయిరీ నిర్వహణ ఇక ప్రభుత్వం గుప్పిట్లోకి

అలాగే సంగం డెయిరీ రోజువారీ కార్యకలాపాలు నిర్వగహించే బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ కు అప్పగించింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ధూళిపాళ్ల నరేంద్రను శుక్రవారం ఉదయం ఏసిబి అధికారులు అరెస్ట్ చేశారు.

ఆయనకు విజయవాడ ఈఎస్ఐ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చారు. ఏసిబి న్యాయస్థానం ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ధూళిపాళ్ళను విజయవాడ జిల్లా జైలుకు  తరలించారు.

click me!