ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హొం: హాజరైన సీఎం జగన్, చంద్రబాబు సహా ప్రముఖులు

Published : Aug 15, 2022, 05:57 PM ISTUpdated : Aug 15, 2022, 09:31 PM IST
ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హొం: హాజరైన సీఎం జగన్, చంద్రబాబు సహా ప్రముఖులు

సారాంశం

ఏపీ రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ , విపక్ష నేత చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఎట్ హోం కార్యక్రమానికి వచ్చిన అతిథులను గవర్నర్ సాదరంగా ఆహ్వానించారు. 

అమరావతి:  75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని అమరావతిలోని రాజ్ భవన్  లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్ జగన్, విపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు.సీఎం జగన్ తన సతీమణి భారతితో పాటు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చంద్రబాబు  వెంట టీడీపీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఉన్నారు. 

స్వాతంత్య్ర  దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15వ తేదీ  సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఇవాళ కూడ రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన అతిథులను గవర్నర్  బిశ్వభూషన్ హరిచందన్ సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన్, హైకోర్టు చీఫ్ జస్టిస్, పలువురు జడ్జిలు,  విపక్ష నేత చంద్రబాబు, పలువురు మంత్రులు, అధికారులు, వీఐపీలు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్, విపక్ష నేత చంద్రబాబులు ఎదరు పడలేదు. దాదాపుగా మూడేళ్ల తర్వాత సీఎం జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబులు ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం