మరోసారి పేదల పక్షపాతి అని నిరూపించుకున్న జగన్

By telugu teamFirst Published Feb 29, 2020, 2:53 PM IST
Highlights

పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కుటుంబం తమ భూమిని పోలవరం డ్యామ్ నిర్మాణ సమయంలో ముంపు గ్రామాలకింద పోగొట్టుకుంది. ఆ సదరు కుటుంబం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్లే మార్గంలో తమకు న్యాయం చేయాలంటూ ఒక కాగితం పట్టుకు నిల్చున్నారు

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి తాను పెద్ద ప్రజల పక్షపాతినని నిరూపించుకున్నాడు. ఒక సామాన్యుడి గోడు వినేందుకు నేరుగా తన కాన్వాయ్ ని ఆపి ఆ పేదవాడి కష్టాన్ని సావధానంగా విని ఆ నిరుపేద కష్టాన్ని తక్షణం తీర్చాల్సిందిగా ఆదేశించాడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 

వివరాల్లోకి వెళితే... పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కుటుంబం తమ భూమిని పోలవరం డ్యామ్ నిర్మాణ సమయంలో ముంపు గ్రామాలకింద పోగొట్టుకుంది. ఆ సదరు కుటుంబం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్లే మార్గంలో తమకు న్యాయం చేయాలంటూ ఒక కాగితం పట్టుకు నిల్చున్నారు. ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందేమో ముఖ్యమంత్రికి ఆ కాగితం పట్టుకున్న కుటుంబం కనబడకుండా చూస్తున్నారు. 

కానీ ఎలాగో అలా ముఖ్యమంత్రి కంట్లో ఆ కుటుంబ సభ్యులు పడ్డారు. వెంటనే ముఖ్యమంత్రి తన కాన్వాయ్ ని ఆపమని సిబ్బందిని ఆదేశించడంతో కాన్వాయ్ ఆగింది. వెంటనే తన భద్రత సిబ్బందిని ఆ కాగితం పట్టుకున్న కుటుంబాన్ని తీసుకురావలిసిందిగా ఆదేశించారు. 

ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యను ఈ విధంగా విన్నవించుకున్నారు. "మాతో పాటు మా ఊరిలో మరికొన్ని కుటుంబాలు స్థానికంగానే నివాసం ఉంటున్నప్పటికీ... అందరికీ ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ వర్తింప చేయలేదు.

మాకు మాత్రమే ఇచ్చినందున మేము తీసుకోలేదు. అందరికీ ఈ ప్యాకేజీ ఇచ్చేలా చూడండి. ఇటీవల వరద సమయంలో కూడా మా కుటుంబాలకు రూ.5 వేల సాయం అందలేదు" అని వారు వాపోయారు. 

దీనిపై వెంటనే స్పందించిన జగన్... ఎవ్వరికి అన్యాయం జరగకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని చెబుతూ... సత్వరం వీరికి న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ ను ఆదేశించారు. 

click me!