ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన గన్నవరం నుండి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం మోడీతో జగన్ భేటీ కానున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం YS Jagan గురువారం నాడు మధ్యాహ్నం New Delhiకి చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం ప్రధానమంత్రి Narendra Modi తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు సమస్యలతో పాటు నిధుల విషయమై చర్చించనున్నారు. మరో వైపు రాష్ట్రపతి Ramnath Kovind ఎన్నికల విషయమై కూడా జగన్ మోడీతో చర్చించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఇటీవలనే థావోస్ పర్యటన నుండి వచ్చారు. Davos లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన కంపెనీల విషయాలపై కూడా ప్రధాని మోడీకి జగన్ వివరించే అవకాశం ఉంది. మరో వైపు వచ్చే నెలతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం పూర్తి కానుంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికల విషయమై ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్ మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది.
ప్రధానంగా పెండింగ్ ప్రాజెక్టులు, పోలవరానికి నిధులు, తదితర అంశాలపై ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కూడా జగన్ చర్చించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా జగన్ భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏపీ సీఎం ఢిల్లీకి వెళ్లొచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధాని, కేంద్రమంత్రులతో సీఎం జగన్ చర్చించారు.ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి రావాల్సిన నిధులపై కూడా ప్రధానంగా సీఎం జగన్ కేంద్ర పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. మరో వైపు కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కూడా జగన్ చర్చించే అవకాశం ఉంది.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి సంబంధించి కేంద్రం రీయింబర్స్మెంట్ చేయాల్సిన రూ.2,800 కోట్లను కూడా త్వరితగతిన చెల్లించేలా చూడాలని సీఎం జగన్ ప్రధానిని కోరనున్నట్టు తెలుస్తోంది.
also read:రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్: ప్రధాని మోడీ, అమిత్‌షాలతో భేటీకి చాన్స్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.42,472 కోట్ల రుణం తీసుకునేందుకు మాత్రమే కేంద్రం అనుమతించింది. కానీ జగన్ సర్కార్ మాత్రం ఈ పరిమితికి మించి రూ.55 వేల కోట్లను రుణంగా తీసుకుంది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖతో పాటు, కాగ్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నారు. ఈ తరుణంలో ప్రధానితో ముఖ్యమంత్రి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది,
గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలతో ప్రస్తుతం ఏపీ రుణాల మొత్తం రూ. 4,39,394 కోట్లకు పెరిగింది. మరోవైపు వివిధ కార్పొరేషన్లు తీసుకున్న రూ. 1,17,503 కోట్ల రుణాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం హామీదారుగా ఉంది. ఈ అంశాలను ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రికీ సీఎం జగన్ వివరించే అవకాశం వుంది.
ఏపీ రుణాలపై పూర్తి సమాచారం ఇవ్వాలంటూ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ కార్యాలయం ,కేంద్ర ఆర్థిక శాఖ తరచూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను కూడా కాగ్, పీఏజీ అధికారులు సమావేశమై వివరాలు ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తీసుకున్న రుణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కాగ్‌కు వివరాలు సమర్పించలేనట్టు తెలుస్తోంది. ఈ అంశాలన్నీ ప్రధానికి వివరించి రుణపరిమితి సీలింగ్‌పై వెసులుబాటు ఇవ్వాల్సిందిగా జగన్ కోరే అవకాశం ఉంది.