ఈ నెల 15వ తేదీన సీఎం జగన్ అమెరికా పర్యటన

By telugu teamFirst Published Aug 12, 2019, 10:08 AM IST
Highlights

సీఎం జగన్ చిన్న కుమార్తె వర్షా రెడ్డిని అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో గ్యాడ్యుయేట్ కోర్సులో చేర్పించేందుకు వెళుతున్నారని సమాచారం. ఈ నెల 17న డల్లాస్ లోని కే బెయిలీ హచిసెన్ కన్వెన్షన్ సెంటర్ లో ఉత్తర అమెరికాలోని తెలుగు ప్రజలతో జరిగే ఆత్మీయ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15వ తేదీన కుటుంబసభ్యులతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.  తిరిగి 24వ తేదీన ఆయన తాడేపల్లి కి చేరుకుంటారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత  అదే రోజు ఆయన హదరాబాద్ వెళ్లనున్నారు.

అక్కడి నుంచి కుటుంబసభ్యులతో రాత్రికి శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికాకు బయలుదేరుతారు. సీఎం జగన్ చిన్న కుమార్తె వర్షా రెడ్డిని అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో గ్యాడ్యుయేట్ కోర్సులో చేర్పించేందుకు వెళుతున్నారని సమాచారం. ఈ నెల 17న డల్లాస్ లోని కే బెయిలీ హచిసెన్ కన్వెన్షన్ సెంటర్ లో ఉత్తర అమెరికాలోని తెలుగు ప్రజలతో జరిగే ఆత్మీయ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 

click me!