ఎమ్మెల్సీ ఉప ఎన్నిక: వైసీపీ అభ్యర్ధులు వీరే

Siva Kodati |  
Published : Aug 12, 2019, 09:17 AM ISTUpdated : Aug 12, 2019, 09:21 AM IST
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక: వైసీపీ అభ్యర్ధులు వీరే

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న శాసనమండలి ఉప ఎన్నికకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ఖరారు చేసింది. నేతలతో పలుమార్లు చర్చలు జరిపిన పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా మోపిదేవి వెంకటరమణ, మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డిలను ఖరారు చేశారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన శాసనమండలి స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 3,  తెలంగాణలో ఒక స్థానానికి నోటిఫికేషన్ వెలువరించింది.

ఏపీలో కరణం బలరాం, ఆళ్ల నాని , కోలగట్ల వీరభద్ర స్వామి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా.. తెలంగాణలో యాదవరెడ్డిపై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఇందుకు సంబంధించి ఆగస్టు 7న నోటిఫికేషన్ వెలువడనుండగా.. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 14 వరకు గడువు విధించారు. ఈ నెల 16న నామినేషన్ల పరిశీలిన, ఆగస్టు 19న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఆగస్టు 26న పోలింగ్ జరిపి.. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించనున్నారు.     

PREV
click me!

Recommended Stories

Jobs Notification 2026 : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. ఎగ్జామ్ లేకుండానే రూ.49,000 శాలరీ గవర్నమెంట్ జాబ్
IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్ తో ఆగమాగం... ఇక్కడ ఏకంగా 46 మి.మీ వర్షమే..! ఇక అతలాకుతలమే