సుధీర్ఘ లాక్‌డౌన్ కారణంగా ఏపీలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. సోమవారం ఏపీలో లాక్‌డౌన్ సడలింపులు, ప్రజా రవాణా తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు
సుధీర్ఘ లాక్‌డౌన్ కారణంగా ఏపీలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. సోమవారం ఏపీలో లాక్‌డౌన్ సడలింపులు, ప్రజా రవాణా తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ భేటీలో ఆర్టీసీ బస్సులు నడపాలని సీఎం నిర్ణయించారు. బస్సు సర్వీసులపై విధి విధానాలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సగం సీట్లు మాత్రమే నింపి బస్సులు నడపాలని సీఎం సూచించారు.
undefined
ప్రతీ ఆర్టీసీ బస్సులో 20 మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని, ఖచ్చితంగా ప్రయాణీకుల మధ్య భౌతిక దూరం పాటించాల్సిందేనని జగన్ ఆదేశించారు. అలాగే బస్సుల్లో ప్రయాణించే వారికి మాస్కు తప్పనిసరన్న ముఖ్యమంత్రి.. బస్టాండ్‌లో దిగగానే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని అన్నారు.
రాష్ట్రంలో దశల వారీగా బస్సు సర్వీసులను పెంచాలని అధికారులను జగన్ ఆదేశించారు. అటు తెలంగాణలోనూ రేపటి నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభంకానున్నాయి. కాగా లాక్‌డౌన్ 4 లో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
దీనిలో భాగంగా బస్సులు నడిపే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. గ్రీన్ , ఆరెంజ్ జోన్లలోనే భౌతిక దూరాన్ని పాటిస్తూ బస్సు సర్వీసులను నడపాలన్న కేంద్రం.. రెడ్, కంటైన్మెంట్ జోన్లకు మాత్రం ప్రజా రవాణాను నిషేధించింది.