జగన్ సర్కార్‌కు ఏపీ హైకోర్టు షాక్: మడ అడవుల నరికివేతపై స్టేటస్ కో

By narsimha lodeFirst Published May 18, 2020, 3:32 PM IST
Highlights

కాకినాడ సమీపంలోని మడ అడవుల నరికివేతపై ఏపీ హైకోర్టు  సోమవారం నాడు స్టేటస్ కో విధించింది.


విజయవాడ: కాకినాడ సమీపంలోని మడ అడవుల నరికివేతపై ఏపీ హైకోర్టు  సోమవారం నాడు స్టేటస్ కో విధించింది.

మడ అడవులను నరికివేస్తూ పేదలకు  ఇళ్ళ స్థలాలను ఇవ్వాలని  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  మడ అడవులను నరికివేతను  స్థానిక మత్స్యకారులు కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై టీడీపీ నేతలు కూడ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.

మడ అడవుల నరికివేతను నిరసిస్తూ ఇద్దరు మత్స్యకారులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు సోమవారం నాడు వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారణ జరిపింది. ఈ విచారణలో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.

మడ అడవుల నరికివేత నిర్ణయంపై ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తోందో చూడాలి. పేదలకు  ఇళ్ల స్థలాల పట్టాలను ఇచ్చేందుకు ఈ స్థలం అనువుగా ఉంటుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. 

also read:చంద్రబాబే అనుమతులిచ్చారు: ఎల్జీ పాలీమర్స్ బాధితులతో వైఎస్ జగన్

'కాకినాడ పోర్టుకు సమీపంలోనే మడ అడవులు ఉంటాయి.ఈ మడ అడవులు అనేక తుఫాన్ల నుండి ప్రజలను కాపాడినట్టుగా  స్థానికులు చెబుతున్నారు. మడ అడవుల నరికివేత నిర్ణయాన్ని నిరసిస్తూ టీడీపీ ప్రతినిధి బృందం ఇటీవల కాకినాడలో పర్యటించింది. మడ అడవులు ప్రాంతాన్ని పరిశీలించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకొన్నారు. మడ అడవులను నరికివేయవద్దని కోరుతూ స్థానిక అధికారులకు టీడీపీ నేతలు వినతి పత్రం ఇచ్చారు.

click me!