సీబీఐ విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దూరమయ్యారు. ఈ విషయమై సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ సీబీఐ విచారణకు దూరమయ్యారు. అయితే సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే సర్వత్రా ఉత్కంట నెలకొంది. తల్లికి అనారోగ్యంగా ఉందని చెబుతూ చివరిన నివిషయంలో సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి దూరమయ్యారు.
ఇవాళ ఉదయం హైద్రాబాద్ లోని తన నివాసం నుండి సీబీఐ విచారణకు హాజరుకాకుండా పులివెందులకు బయలుదేరారు. తల్లికి అనారోగ్యం కారణంగా విచారణకు హా.జరుకాలేనని వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ పంపారు. వైఎస్ అవినాష్ రెడ్డి నుండి సమాచారం రాగానే సీబీఐ అధికారుల బృందం తమ కార్యాలయం నుండి కారులో బయలుదేరారు. వైఎస్ అవినాష్ రెడ్డి పంపిన లేఖపై సీబీఐ అధికారులు అనుమతిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.
undefined
also read:తల్లికి అనారోగ్యం: సీబీఐ విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దూరం
ఈ నెల 16వ ేతేదీన విచారణకు రావాలని సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. కానీ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కార్యక్రమాల కారణంగా విచారణకు రాలేనని వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశాడు. నాలుగు రోజుల సమయం అడిగారు. దీంతో ఇవాళ విచారణకు రావాలని సీబీఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. తల్లికి అనారోగ్యం కారణంగా చూపుతూ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ విచారణకు రాలేదు.