కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లికి గుండెపోటు వచ్చిందని ఆయన తరపు న్యాయవాదులు చెప్పారు.
హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లికి గుండెపోటు వచ్చిందని ఆయన తరపు న్యాయవాదులు చెప్పారు. ఈ విషయాన్ని సీబీఐకి లేఖ ద్వారా తెలిపామని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది మల్లారెడ్డి వివరించారు.. విచారణ కోసం మరో తేదీని ఇవ్వాలని కూడ కోరినట్టుగా లాయర్ చెబుతున్నారు.
సీబీఐ విచారణకు బయలుదేరిన సమయంలోనే తల్లి అనారోగ్యం గురించి వైఎస్ అవినాష్ రెడ్డికి తల్లి అనారోగ్యం గురించి సమాచారం వచ్చిన విషయాన్ని లాయర్లు చెబుతున్నారు.తల్లికి అనారోగ్యం విషయం తెలిసి విచారణకు వెళ్లకుండా పులివెందులకు వైఎస్ అవినాష్ రెడ్డి బయలుదేరారని లాయర్ మల్లారెడ్డి వివరించారు.
undefined
also read:విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి దూరం: సీబీఐ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
ఇవాళ ఉదయం 11 గంటలకు సీబీఐ విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. కానీ వైఎస్ అవినాష్ రెడ్డి మాత్రం విచారణకు హాజరు కాలేదు. ఈ నెల 16నే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున విచారణకు రాలేనని వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశాడు. నాలుగు రోజుల సమయం కావాలని ఆయన కోరారు. దీంతో ఇవాళ విచారణకు రావాలని సీబీఐ మరో నోటీసు అందించింది.