25వ వివాహ వార్షికోత్సవం... 5 రోజులపాటు ఫ్యామిలీతోనే జగన్, రేపు చంఢీగడ్‌కు

Siva Kodati |  
Published : Aug 25, 2021, 02:57 PM ISTUpdated : Aug 25, 2021, 03:00 PM IST
25వ వివాహ వార్షికోత్సవం... 5 రోజులపాటు ఫ్యామిలీతోనే జగన్, రేపు చంఢీగడ్‌కు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపటి నుంచి కుటుంబ సమేతంగా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 28న జగన్- భారతీల పెళ్లి రోజు . సిల్వర్ జూబ్లీ నేపథ్యంలో 5 రోజుల పాటు కుటుంబంతో గడపనున్నారు జగన్. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపటి నుంచి కుటుంబ సమేతంగా పర్యటనకు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి , మధ్యాహ్నం 1 గంటకు చండీగఢ్‌కు బయల్దేరనున్నారు జగన్.  మధ్యాహ్నం 4 గంటలకు సిమ్లాలోని ఒబెరాయ్ హోటల్‌కు చేరుకోనున్నారు. ఈ నెల 28న జగన్- భారతీల పెళ్లి రోజు . సిల్వర్ జూబ్లీ నేపథ్యంలో 5 రోజుల పాటు కుటుంబంతో గడపనున్నారు జగన్. 

Also Read:జగన్‌కు జైలా.. బెయిలా, సస్పెన్స్‌కు పడని తెర.. తీర్పు మరోసారి వాయిదా

ఈ నెల 26 నుంచి నాలుగు రోజుల పాటు సిమ్లా లేదా డెహ్రాడూన్ ప్రాంతాల్లో గడపేందుకు వెళ్ళనున్నారు ఏపీ సీఎం జగన్. అయితే నాలుగు రోజుల టూర్ ను ఫ్యామిలీ తో వెళ్లాలని ప్లాన్ చేశారు సిఎం జగన్. ఈ మేరకు ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రత్యేక పైన విమానం లో వెళ్లాలని సిఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 

PREV
click me!

Recommended Stories

Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?