మహా అగ్ని కణం అల్లూరి.. తెలుగు జాతికి, భారతదేశానికి గొప్ప స్పూర్తి ప్రదాత: సీఎం జగన్

Published : Jul 04, 2022, 11:52 AM ISTUpdated : Jul 04, 2022, 12:09 PM IST
మహా అగ్ని కణం అల్లూరి.. తెలుగు జాతికి, భారతదేశానికి గొప్ప స్పూర్తి ప్రదాత: సీఎం జగన్

సారాంశం

అల్లూరి జయంతిని పురస్కరించుకుని వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. భీమవరం వచ్చిన ప్రధాని మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.   

అల్లూరి జయంతిని పురస్కరించుకుని వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.  అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో భాగంగా.. భీమవరం సమీపంలోని పెదఅమిరంలో బహిరంగ సభలో ప్రధాని మోదీ, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి.. తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. భీమవరం వచ్చిన ప్రధాని మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 

పరాయి పాలనపై మన దేశం యుద్దం చేస్తూ అడుగులు ముందుకేసిందని సీఎం జగన్ గుర్తుచేశారు. లక్షల మంది త్యాగాల ఫలితమే ఇవాల్టి భారతదేశమని అన్నారు. 
పోరాట యోధుల్లో మహా అగ్ని కణం అల్లూరి సీతారామరాజు అని పేర్కొన్నారు. ఆయన తెలుగు గడ్డపై పుట్టడం గర్వకారణమని సీఎం జగన్‌ అన్నారు. తెలుగు జాతికి, భారతదేశానికి గొప్ప స్పూర్తి ప్రధాత అల్లూరి అని అన్నారు. అల్లూరి ఘనతను గుర్తుంచుకునే.. ఆయన పేరు మీద జిల్లా పెట్టుకున్నామని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?