
జగనన్న చేదోడు (Jagananna Chedodu) కింద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) మంగళవారం లబ్ధిదారుల ఖాతాల్లో రెండో ఏడాది నగదును జమ చేశారు. ఈ పథకం కింద దుకాణాలు ఉన్న రజకులు, నాయూబ్రాహ్మణులు, దర్జీల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,85,350 మంది ఖాతాల్లో రూ. 285.35 కోట్లు జమ చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆయన బటన్ నొక్కి ఈ మొత్తాన్ని జమ చేశారు. లబ్దిదారుల్లో రజకులు 98,439 మంది, దర్జీలు 1,46,103 మంది, నాయీబ్రాహ్మణులు 40,808 ఉన్నారు. వీరందరి
ఈ సందర్భంగా YS Jagan మాట్లాడుతూ.. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. లంచాలు, వివక్షతకు తావు లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. వరుసగా రెండో ఏడాది జగనన్న చేదోడు అమలు చేస్తున్నామని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను గత ప్రభుత్వం నీరుగార్చిందని విమర్శించారు. ఎన్నికల ముందు ఏలూరులోని తానిచ్చిన మాట ప్రకారం బీసీలను వెన్నెముక కులాలుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
బీసీ కమిషన్‌ను శాశ్వత ప్రతిపాదికన నియమించిన రాష్ట్రం కేవలం ఏపీ మాత్రమేనని సీఎం జగన్ అన్నారు. కేబినెట్ కూర్పులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలకు 60 శాతం పదవులు ఇచ్చిన ప్రభుత్వం తమదని అన్నారు. శాసనసభ స్పీకర్ పదవి సైతం బీసీలకు ఇచ్చామని చెప్పారు. అనేక పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలకు పెద్ద పీట వేశామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 92 శాతం కార్పొరేషన్ చైర్మన్ పదవులిచ్చామని చెప్పారు. మున్సిపల్ చైర్మన్ పదవులను 73 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చామని తెలిపారు. నామినేటెట్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వర్గాలకే ఇచ్చామని వెల్లడించారు.
‘అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కోర్టుకెళ్లారు. పేదలకు ఇల్లు రాకుండా అడ్డుకున్న చంద్రబాబుకు కామ్రేడ్లు మద్దతు ఇస్తున్నారు. ఎర్రజెండా వెనక.. పచ్చ జెండా ఉంది. చంద్రబాబు సీఎం కాలేదన్న బాధ ఉన్నవారికే ఆందోళనలు కావాలి’ అని జగన్ అన్నారు.