కూర లేదని తల్లిని గొడ్డలితో నరికిన తనయుడు.. !!

Published : Feb 08, 2022, 11:33 AM IST
కూర లేదని తల్లిని గొడ్డలితో నరికిన తనయుడు.. !!

సారాంశం

మద్యం మత్తులో దారుణానికి తెగబడ్డాడో కొడుకు. భోజనంలోకి కూర లేదని చెప్పిన తల్లిని అతి కిరాతకంగా హతమార్చాడు. అడ్డు వచ్చిన తండ్రితోనూ వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపింది.

జి.మాడుగుల :  dinnerలో కూర లేదని own motherని ఓ కుమారుడు కర్కశంగా గొడ్డలితో నరికి హతమార్చాడు. వంతాల పంచాయతీ అడ్దులలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ సత్యనారాయణ, స్థానికుల కథనం ప్రకారం..  రామన్న దొర, అర్జులమ్మ (60)దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు మత్స్యలింగం (35) ఆదివారం అర్ధరాత్రి బాగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తల్లి అర్జులమ్మను  నిద్ర లేపి భోజనం పెట్టమన్నాడు.

ఈ మేరకు అర్జులమ్మ భోజనం వడ్డించింది. అయితే చారు మాత్రమే ఉందని, కూర లేదని చెప్పడంతో ఆగ్రహించిన కొడుకు తల్లిపై చేయి చేసుకున్నాడు. అడ్డు వచ్చిన తండ్రితో వాగ్వాదానికి దిగాడు. దీంతో పెద్ద కుమారుడిని తీసుకు వస్తానని చెప్పి తండ్రి బయటకు వెళ్ళాడు.  అప్పటికి liquor మత్తులో ఉన్న మత్స్య లింగం విపరీతమైన కోపంతో  తల్లి తలపై axeతో attack చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో అర్జులమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం గ్రామాన్ని సందర్శించారు. కొడుకు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా ఇలాంటి దారుణ ఘటనే నిరుడు నవంబర్ 26న మచిలీపట్నంలో జరిగింది. నవమాసాలు కడుపున మోసి జన్మనిచ్చిన తల్లినే అతి కిరాతకంగా హతమార్చాడో కసాయి కొడుకు. పెళ్లి చేయాలంటూ తల్లితో గొడవపడ్డ తనయుడు ఆవేశంలో తల్లిపై క్రికెట్ బ్యాట్ తో దాడిచేసి హతమార్చాడు. ఈ దారుణం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... krishna district ప్రధాన కేంద్రం మచిలీపట్నం పరాస్ పేటలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్ సమీపంలో చింతరాజు - వెంకటేశ్వరమ్మ దంపతులు కొడుకు హరీష్ రావుతో కలిసి నివాసముటున్నారు. అయితే హరీష్ తనకు పెళ్లి చేయాలంటూ తల్లిదండ్రులను ఒత్తిడి చేయడంతో వారు సంబంధాలు చూస్తున్నారు. బంధువులతో పాటు తెలిసినవారి ద్వారా చాలా సంబంధాలు వచ్చాయి. కానీ ఏ సంబంధమూ పెళ్లివరకు వెళ్లలేదు. 

కొంతకాలంగా ఇలాగే సంబంధాలు రావడం... పెళ్లి కుదరకపోవడంతో హరీష్ డిప్రెషన్ కు గురయ్యాడు. దీంతో తరచూ తల్లిదండ్రులతో గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలోనే తల్లీ కొడుకుల మధ్య గురువారం మరోసారి పెళ్లి విషయంలో మాటామాటా పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన హరీష్ క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి కన్నతల్లిపైనే క్రికెట్ బ్యాట్ తో దాడిచేసాడు. 

వెంకటేశ్వరమ్మ తలపై కొడుకు బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో భయపడిపోయిన హరీష్ తల్లిని అలాగే వదిలేని ఇంటితలుపులు మూసేసి పరారయ్యాడు. ఈ ఘటన తర్వాత చాలాసేపటికి ఇంటికి వచ్చిన చింతరాజు తలుపుతెరిచి చూడగా భార్య రక్తపుమడుగులో పడివుంది. దీంతో అతడు భార్యను చికిత్స నిమిత్తం బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ దారుణం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. చింత రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

BR Naidu Press Meet: దేశం లోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తిరుపతి స్విమ్స్: బీఆర్ నాయుడు| Asianet Telugu
Swathi Deekshith & Pranavi Manukonda Visit Tirumala Temple: శ్రీవారిసేవలో ప్రముఖులు | Asianet Telugu