ప్రతి కుటుంబానికి మహిళలే రథసారధులని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు.
అమరావతి: ప్రతి కుటుంబానికి మహిళలే రథసారధులని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు.వైఎస్ఆర్ చేయూత పథకం కింద రెండో ఏడాది మహిళల ఖాతాల్లో రూ. 4,339.39 కోట్లు నిధులను విడుదల చేశారు సీఎం జగన్. 45 ఏళ్ల నుండి 60 ఏళ్ల లోపు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఈ పథకం కింద ఏటా రూ. 18,750 ప్రభుత్వం అందించనున్నారు. నాలుగేళ్లలో రూ. 75 వేలను లబ్దిదారులకు అందించనుంది ప్రభుత్వం. ఈ సందర్భంగా లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ప్రసంగించారు. కేబినెట్ లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చెప్పారు నామినేటేడ్ పదవుల్లో కూడ మహిళలకు 50 శాతం పదవులు కట్టబెట్టామన్నారు.
also read:గుంటూరు గ్యాంగ్‌రేప్ ఘటన: సీఎం జగన్ స్పందన ఇదీ
వైఎస్ఆర్ చేయూత పథకం కింద రెండేళ్లలో రూ. 9 వేల కోట్ల సహాయం అందించినట్టుగా సీఎం చెప్పారు. ఈ పథకం ద్వారా 23.14 లక్షల మంది మహిళలకు లబ్ది కలుగుతోందన్నారు. ఈ పథకంతో మహిళల్లో కొండంత ఆత్మ విశ్వాసం నెలకొంటుందన్నారు. ఎంచుకొన్న వారికి కిరాణా షాపులు, గేదేలు, ఆవులు, మేకల యూనిట్లను ప్రభుత్వం అందించనున్నట్టుగా సీఎం తెలిపారు.
ఇప్పటికే 1.19 లక్షల మహిళలకు ఆవులు, గేదేలు అందించినట్టుగా సీఎం గుర్తు చేశారు. పాలు విక్రయిస్తున్న మహిళలకు లీటర్ పాలకు అదనంగా రూ. 15 లబ్ది పొందేలా కార్యాచరణ రూపొందించామన్నారు. లబ్దిదారులకు సహాయం చేసేందుకు వీలుగా వైఎస్ఆర్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్టుగా సీఎం తెలిపారు. ఈ పథకం కింద ధరఖాస్తు చేసుకోవడానికి మరో నెల రోజులు గడువును పెంచినట్టుగా సీఎం వివరించారు.