గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం సీతానగరం పుష్కరఘాట్ వద్ద మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన తన మనసును కలిచివేసిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఈ తరహా ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటామని సీఎం హమీ ఇచ్చారు. ఇందుకోసం మరింతగా కష్టపడుతానన్నారు.
గుంటూరు: గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం సీతానగరం పుష్కరఘాట్ వద్ద మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన తన మనసును కలిచివేసిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఈ తరహా ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటామని సీఎం హమీ ఇచ్చారు. ఇందుకోసం మరింతగా కష్టపడుతానన్నారు.వైఎస్ఆర్ చేయూత పథకం రెండో విడత నిధులను ఏపీ సీఎం జగన్ మంగళవారం నాడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ వషయమై స్పందించారు.
దిశ, అభయం యాప్ ల ద్వారా మహిళల భద్రత కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఏపీ దిశ బిల్లును రూపొందించామన్నారు. ఈ బిల్లు ఆమోదం కోసం కేంద్రానికి పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో 18 దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
also read:గుంటూరు గ్యాంగ్‌రేప్ కేసులో పురోగతి: పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు
మహిళలు అర్ధరాత్రి పూట నిర్భయంగా తిరిగే రోజులు వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని నమ్మే వ్యక్తుల్లో తాను కూడ ఒకడినన్నారు. మహిళలకు సహాయం కోసం ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించామన్నారు సీఎం జగన్.నాలుగు రోజుల క్రితం ప్రియుడితో కలిసి వచ్చిన ప్రియురాలిపై నిందితులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై అత్యాచారం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొన్నారు.