ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాలు, ఉచిత రేషన్: జగన్ ఆదేశం

By narsimha lodeFirst Published Oct 19, 2020, 8:08 PM IST
Highlights

వరద ప్రభావిత ప్రాంతాల్లో  నిత్యావసరాలు, ఉచిత రేషన్ అందించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.సోమవారం నాడు వరద ప్రభావిత ప్రాంతాల్లో  సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అంతకుముందు ఆయన వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.
 


అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల్లో  నిత్యావసరాలు, ఉచిత రేషన్ అందించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.సోమవారం నాడు వరద ప్రభావిత ప్రాంతాల్లో  సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అంతకుముందు ఆయన వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.

భారీ వరదలు, వర్షాలతో తీవ్రంగా దెబ్బ తిన్న ప్రాంతాల్లో పంట నష్టంపై వెంటనే అంచనాలు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.సకాలంలో ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తే రైతులకు రబీలో పంట పెట్టుబడికి ఉపయోగపడుతోందని సీఎం చెప్పారు. 

ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే 5 నిత్యావసర సరుకులతో ఉచితంగా రేషన్ అందిస్తుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మిగిలిన జిల్లాల్లో కూడ వరదల్లో మునిగిన పంటలతో పాటు ఇళ్లు, పశువులు నష్టపోయిన వారిని గుర్తించి పరిహారం ఇవ్వాల్సిందిగా కోరారు.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బ తిన్న ప్రాంతాల్లో సీఎం ఏరియల్‌ సర్వే నిర్వహించారు.నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, తాడికొండ తదితర నియోజకవర్గాల పరిధిలోని ముంపు ప్రాంతాలను, దెబ్బ తిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలను ఆయన పరిశీలించారు.

click me!