ఎంపీటీసీ, జడ్పీటీసీ రీ నోటిఫికేషన్: ఏపీ హైకోర్టుకు ఎస్ఈసీ క్షమాపణలు

By narsimha lode  |  First Published Mar 5, 2021, 12:18 PM IST

 ఎంపీటీసీ, జడ్పీటీసీ రీ నోటిపికేషన్ పై దాఖలైన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు శుక్రవారం నాడు క్షమాపణ చెప్పింది. ఈ పిటిషన్ పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.


అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ రీ నోటిపికేషన్ పై దాఖలైన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు శుక్రవారం నాడు క్షమాపణ చెప్పింది. ఈ పిటిషన్ పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రీ నోటిపికేషన్ పై హైకోర్టులో శుక్రవారం నాడు విచారణ జరిగింది. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఇదివరకే హైకోర్టు ఆదేశించింది. అయితే కౌంటర్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేయలేదు.

Latest Videos

కౌంటర్ దాఖలు చేయని విషయాన్ని హైకోర్టు ధర్మాసనం గుర్తించింది. ఎందుకు కౌంటర్ దాఖలు  చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయనందుకు హైకోర్టుకు రాష్ట్ర ఎన్నికల సంఘం క్షమాపణలు చెప్పింది.

సోమవారం వరకు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఎన్నికల  సంఘాన్ని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయకపోతే కౌంటర్ లేనట్టేనని భావిస్తామని హైకోర్టు అభిప్రాయపడింది.తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది కోర్టు.

click me!