బాబు గారు.. వైసీపీ అధికారంలోకి ఎప్పుడు వచ్చింది..?

First Published May 10, 2018, 2:59 PM IST
Highlights

ఏపీసీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు

‘‘వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదట..’’ ఈ మాట అన్నది మరెవరో కాదు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అంతా బాగానే ఉంది కానీ.. ఇంతకీ అసలు వైసీపీ అధికారంలోకి ఎప్పుడు వచ్చింది..? ఇదే ప్రశ్న ఇప్పుడు అందరి నోటా వినపడుతోంది. అసలేం జరిగిందంటే..

గురువారం చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన ఓర్వకల్‌ వద్ద జయరాజ్‌ ఇస్పాత్‌ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన పారిశ్రామివేత్తలు, మీడియా సమావేశంలో తీవ్ర అసహనానికి గురైన చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు.

శంకుస్థాపనలకే పరిమితయ్యారంటూ ప్రతిపక్షాలు అరోపిస్తున్నాయని ఓ మీడియా ప్రతినిధి చంద్రబాబును అడగగా.. అందుకు ఆయన తీవ్రంగా స్పందించారు. ‘ప్రతిపక్షం వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు. చేస్తున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనబడటం లేదా.. కేసుల మాఫీ కోసం భారతీయ జనతా పార్టీతో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

అంతే కాకుండా మెక్కుబడిగా మీడియా సమావేశాన్ని నిర్వహించిన చంద్రబాబు రెండు నిమిషాల్లో కార్యక్రమాన్ని ముగించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరో వైపు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం వైసీపీ ఇప్పటి వరకు అధికారంలోకి రాలేదు అన్న విషయం చంద్రబాబు మర్చిపోవడం గమనార్హం.

click me!