నీకు రోజులు దగ్గరపడ్డాయి, లెక్కపెట్టుకో : మోదీకి చంద్రబాబు వార్నింగ్

By Nagaraju penumalaFirst Published Feb 13, 2019, 8:08 PM IST
Highlights

మోదీ డిగ్రీ ఎక్కడ చదివారో సూటిగా చెప్పండి అంటూ నిలదీశారు. కానీఎక్కడ చదువుకున్నారో మోదీ చెప్పలేరని ఎందుకంటే ఆయన చదవుకోలేదని విమర్శించారు. ప్రధాని మోదీ ఐదేళ్ల పాలనలో ఆర్థిక రంగం కుదేలైందన్నారు. 
 

ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ నీకు రోజులు దగ్గరపడ్డాయి లెక్కపెట్టుకో అంటూ హెచ్చరించారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన ధర్మాలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

మోదీ డిగ్రీ ఎక్కడ చదవారో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. మోదీ చదువుకోపోవడం వల్లే దేశానికి ఈ గతి పట్టిందని ఆరోపించారు. కేజ్రీవాల్ ఎక్కడ చదువుకున్నారో చెప్పగలరని, తాను తిరుపతి వెంకటేశ్వర యూనివర్శిటీలో చదువుకున్నానని చెప్పగలనని కానీ మోదీ ఎక్కడ డిగ్రీ చదివారో చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. 
మోదీ డిగ్రీ ఎక్కడ చదివారో సూటిగా చెప్పండి అంటూ నిలదీశారు. కానీఎక్కడ చదువుకున్నారో మోదీ చెప్పలేరని ఎందుకంటే ఆయన చదవుకోలేదని విమర్శించారు. ప్రధాని మోదీ ఐదేళ్ల పాలనలో ఆర్థిక రంగం కుదేలైందన్నారు. 

నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. అంతేకాదు అన్నదాతలు కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. దేశంలో సహకార వ్యవస్థ ఉందా అని నిలదీశారు. ప్రధాని మోదీకి కనీస పరిపాలన సూత్రాలు కూడా తెలియవు అంటూ ఎద్దేవా చేశారు. 

రాఫేల్‌‌ ఒప్పందంలో అనేక అవకతవకలు జరిగాయన్నారు. ప్రధాని మోదీ రోజులు లెక్కపెట్టుకోవాలని త్వరలోనే ఆయన కుర్చీ దిగిపోతారని హెచ్చరించారు. దేశంలో విపక్షాల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. మోదీ ఒత్తిడి తట్టుకోలేక ఆర్‌బీఐ గవర్నర్‌ రాజీనామా చేశారన్నారు. 

కేజ్రీవాల్‌ తన పరిపాలనలో ఢిల్లీలో అద్భుతాలు చేశారని కొనియాడారు. యూపీలో అఖిలేశ్‌ను సైతం అడ్డుకున్నారని గుర్తు చేశారు. మోదీ పాలనలో రాష్ట్రాలు ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను కోల్పోయాయని తెలిపారు.

విపక్ష నేతలపై ఐటీ దాడులు జరుపుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మోదీ అప్రజాస్వామ్య పాలన నుంచి విముక్తి కలిగించేందుకే తామంతా ఏకమైనట్లు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 

click me!