బిజెపిలో చేరిన అశోక గజపతిరాజు అన్న కూతురు

By Arun Kumar PFirst Published Oct 4, 2018, 3:16 PM IST
Highlights

మాజీ కేంద్ర మంత్రి, టిడిపి ఎంపి అశోక గజపతి రాజు సోదరుడి కూమార్తె సంచిత బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. విజయనగరం జిల్లాలో టిడిపి పార్టీకి పెద్దదిక్కుగా వ్యవహరించే అశోక గజపతిరాజుకు ఇలా సొంతింటివారే ఎదురుతిరిగి వేరే పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.

బిజెపిలో తన చేరికపై ఆనంద గజపతిరాజు కూతురు సంచిత మాట్లాడుతూ...బిజెపి పార్టీ అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితమై ఇందులో చేరినట్లు తెతిపారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తననెంతో ప్రభావితం చేశాయన్నారు. అందువల్ల రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు తగినంత సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే బిజెపిలో చేరినట్లు సంచిత వివరించారు.

 కుటుంబ సభ్యులంతా ఒకే పార్టీలో ఉండాల్సిన అవసరమేమీ లేదని ఎవరికి నచ్చిన పార్టీలో వారు చేరవచ్చని సంచిత పేర్కొన్నారు. బాబాయ్ పార్టీ బాబాయిదే...తన పార్టీ తనదే అని స్పష్టం చేశారు. అయితే బిజెపితో పాటు తెలుగు దేశం కూడా ప్రజలకు మంచి పాలన అందిస్తున్నాయని ప్రశంసించారు.  

ఆంధ్ర ప్రదేశ్ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని సంచిత తెలిపారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ విషయంలో రాజకీయాలు చేయడం మానుకోవాలని ఇతర పార్టీలను  సూచించారు. బిజెపి చేపట్టిన స్వచ్చ భారత్ తననెంతో ఆకట్టుకుందని సంచిత పేర్కొన్నారు.   

click me!