పెథాయ్ సహాయక చర్యలపై డాక్యుమెంటరీ: అధికారులకు చంద్రబాబు ఆదేశం

By Arun Kumar PFirst Published Dec 17, 2018, 9:04 PM IST
Highlights

పెథాయ్ తుపాను కారణంగా ఆంధ్ర ప్రదేశ్ అతలాకుతలం అవుతోన్న విషయం తెలిసిందే. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు, జిల్లా యంత్రాంగం చేపట్టే సహాయక చర్యలపై డాక్యుమెంటరీ రూపొందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భవిష్యత్ ఇలాంటి ఉపద్రవాలు సంబవించినపుడు ఆ డాక్యుమెంటరీ ఉపయోగపడుతుందని ఆయన సూచించారు. 

వెల‌గ‌పూడి స‌చివాల‌యంలోని రియ‌ల్‌టైం గ‌వ‌ర్న‌న్స్‌లో తుపాను ప్రభావంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు ముఖ్యంగా ప్రాణ నష్టం జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని...ఆ తర్వాత ఆస్తుల గురించి ఆలోచించాలని సూచించారు. అధికారులంతా క్షేత్ర స్థాయిలో పనిచేయాలని సీఎం ఆదేశించారు. 

మత్స్యకారులకు హుద్‌హుద్, తిత్లీ తుఫానుకు ఇచ్చినట్టుగా నిత్యావసరాల ప్యాకేజ్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. తుపాను ప్రభావిత తీర ప్రాంత గ్రామాల ప్రజలందరికి ఈ ప్యాకేజి అందించాలన్నారు. తుపాను వల్ల జరిగిన పంట నష్టాన్ని రెండు రోజుల్లో అంచనా వేసి 20వ తేదీకల్లా పరిహారాన్ని అందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 

ఈ రాత్రి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నుంచి సమాచారం ఉందని...అందువల్ల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి చంద్రబాబు విజ్ఞ‌ప్తి చేశారు.
 
click me!