వాళ్లకు పుట్టగతులు లేవ్, మీ పరిస్థితి అంతే: చంద్రబాబు శాపనార్థాలు

By rajesh yFirst Published Feb 1, 2019, 4:32 PM IST
Highlights

వైసీపీలో ట్రాప్‌లో పడ్డానని ప్రధాని మోదీ అంటున్నారని తాను కాదు పడింది మోదీయేనన్నారు. ప్రధాని మోదీనే అవినీతి పరుడి ట్రాప్‌లో పడ్డారని విమర్శించారు. తాను కలవడానికి వెళ్తే సమయమివ్వరని ఆరోపించిన చంద్రబాబు 11 కేసుల్లో ఉన్నవారికి మాత్రం సమయం కేటాయిస్తారని విమర్శించారు. 
 
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విభజించిన పాపానికి కాంగ్రెస్ పార్టీ పుట్టగతులు లేకుండా పోయిందని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

అసెంబ్లీలో కేంద్రం చేసిన మోసంపై మాట్లాడిన చంద్రబాబు కాంగ్రెస్ కు వేసిన శిక్ష కంటే బీజేపీకి పెద్దశిక్ష వేస్తారని చెప్పుకొచ్చారు. నమ్మించి మోసం చేసిన బీజేపీకి ప్రజలు అంతకంటే పెద్ద శిక్ష వేస్తారని జోస్యం చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటారు కానీ అసెంబ్లీకి మాత్రం రారని ఎద్దేవా చేశారు. 

వైసీపీలో ట్రాప్‌లో పడ్డానని ప్రధాని మోదీ అంటున్నారని తాను కాదు పడింది మోదీయేనన్నారు. ప్రధాని మోదీనే అవినీతి పరుడి ట్రాప్‌లో పడ్డారని విమర్శించారు. తాను కలవడానికి వెళ్తే సమయమివ్వరని ఆరోపించిన చంద్రబాబు 11 కేసుల్లో ఉన్నవారికి మాత్రం సమయం కేటాయిస్తారని విమర్శించారు. 

తనది యూటర్న్‌ కాదని  రైట్ టర్న్‌ అని చెప్పుకొచ్చారు. తమది ధర్మపోరాటమని ధర్మమే ఎప్పుడూ గెలుస్తుందని తెలిపారు. తాము ఎవరినో చూసి యూటర్న్ అవ్వాల్సిన పనిలేదని తాము ఎప్పుడూ రైట్ టర్న్ లోనే వెళ్తున్నామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

ఇకపోతే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి మోదీపై దండెత్తుతున్న చంద్రబాబు నాయుడు ఇలా కాంగ్రెస్ పార్టీపై వ్యాఖ్యలు చెయ్యడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత నెమ్మదిగా తుడిచిపెట్టుకుపోతుందనుకున్న తరుణంలో మిత్రులా ఉన్న చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం చర్చకు దారితీసింది.  

click me!