ప్రజాస్వామ్యంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు, రావచ్చు: కేసీఆర్ కు చంద్రబాబు కౌంటర్

Published : Dec 12, 2018, 04:30 PM ISTUpdated : Dec 12, 2018, 04:31 PM IST
ప్రజాస్వామ్యంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు, రావచ్చు: కేసీఆర్ కు చంద్రబాబు కౌంటర్

సారాంశం

రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లవచ్చు, రావొచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒంగోలులోని జ్ఞానభేరిసభలో పాల్గొన్న చంద్రబాబు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లానని అక్కడి సీఎం కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి తనకేదో గిఫ్ట్‌ ఇస్తానంటున్నారని చెప్పుకొచ్చారు.   

ఒంగోలు: రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లవచ్చు, రావొచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒంగోలులోని జ్ఞానభేరిసభలో పాల్గొన్న చంద్రబాబు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లానని అక్కడి సీఎం కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి తనకేదో గిఫ్ట్‌ ఇస్తానంటున్నారని చెప్పుకొచ్చారు. 

ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మెప్పించేందుకు ఎక్కడికైనా వెళ్లి రావొచ్చన్నారు. ఎన్టీఆర్‌ టీడీపీ తెలుగుజాతి కోసం స్థాపించారని చంద్రబాబు గుర్తు చేశారు. కొందరు అటూ ఇటూ లాలూచీ పడొచ్చేమోగానీ తాము మాత్రం తెలుగువారు ఎక్కడ ఉన్నా పనిచేశామన్నారు.
 
ప్రపంచంలో ఎవరైనా మాట్లాడితే తాజ్‌మహల్‌ గురించి మాట్లాడతారని ఆతర్వాత ఏపీ అసెంబ్లీ గురించే మాట్లాడే పరిస్థితికి తీసుకువస్తానన్నారు. ప్రపంచం మెుత్తం మెచ్చుకునేలా రాజధాని నిర్మాణం చేపడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.  

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్