కోల్‌కతాకు జగన్, కేసీఆర్ డుమ్మా: చంద్రబాబు కామెంట్స్

By sivanagaprasad kodatiFirst Published Jan 19, 2019, 9:59 AM IST
Highlights

2019 ఎలక్షన్ మిషన్‌పై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోల్‌కతాలో జరిగనున్న యునైటెడ్ ఇండియా ర్యాలీకి 20కి పైగా పార్టీల నాయకులు హాజరయ్యారని.. కానీ జగన్, కేసీఆర్ మాత్రం రాలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 

కోల్‌కతా వచ్చిన వాళ్లంతా మోడీ వ్యతిరేకులేనని బాబు అన్నారు. కేసీఆర్, జగన్ ఉన్నది మోడీ వెంటనే అనేద ఈ ఘటనతో మరోసారి స్పష్టమైందని టీడీపీ అధినేత గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చామని బీజేపీ అనడం హాస్యాస్పదమని దుయ్యబట్టారు.

29 సార్లు ఢిల్లీ వెళ్తే రాష్ట్రానికి మొండిచేయి చూపడం, గాయాలపై కారం చల్లడమేనా  స్పెషల్ ట్రీట్‌మెంటా అంటే అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కర్ణాటకలో బీజేపీ దుర్మార్గ రాజకీయాలు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దేశంలోని ఆలయాల్లో అశాంతిని సృష్టిస్తోందని, శబరిమలలో ఉద్రిక్తలు రెచ్చగొడుతోందని, అయోధ్యంలో రామాలయం అంశాన్ని మరోసారి తెరమీదకు తీసుకొచ్చిందని, వీటన్నింటి పట్ల దేశప్రజలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. 

click me!