నెల్లూరు రాజకీయం: ఆ నేతల పయనమెటు

By narsimha lodeFirst Published Jan 18, 2019, 9:01 PM IST
Highlights

నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి  పయనమెటు అనే చర్చ సర్వత్రా ఆసక్తి  నెలకొంది 


నెల్లూరు: నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి  పయనమెటు అనే చర్చ సర్వత్రా ఆసక్తి  నెలకొంది  మరో వైపు విష్ణువర్థన్ రెడ్డిని కాంగ్రెస్, టీడీపీలు తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి.

వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్‌ రెడ్డి చాలా కాలంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో విభేదించి దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో విష్ణువర్థన్‌రెడ్డితో సఖ్యతగా ఉంటున్నారు. రాజకీయంగా వీరిద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చే సూచనలు కన్పిస్తున్నట్లు కావలిలో ప్రచారం జరుగుతోంది. 

రాజకీయంగా వీరిద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చే సూచనలు కన్పిస్తున్నట్లు కావ లిలో ప్రచారం జరుగుతోంది. శుక్రవారం విష్ణు నివా సంలో వీరిద్దరూ సమావేశం కానున్నట్లు సమాచారం. బహుశా ఈ భేటీ రాజకీయంగా కీలకమైందిగా భావిస్తున్నారు.

మరో వైపు విష్ణువర్ధన్ రెడ్డి  ఏ పార్టీలో చేరుతారనేది ఆసక్తికరంగా మారింది. వైఎస్ఆర్ మరణం తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి  వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డికి వైసీపీ టిక్కెట్టు దక్కలేదు. ఈ దఫా కూడ ఆయన టిక్కెట్టు కోసం ప్రయత్నిస్తున్నారు.అయితే ఎమ్మెల్సీ  పదవిని ఇస్తానని  జగన్ హామీ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. కానీ, విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే ఆసక్తిగా ఉన్నారని సమాచారం.

అవసరమైతే విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో  చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. మరో వైపు టీడీపీ నేతలు కూడ విష్ణువర్ధన్ రెడ్డికి గాలం వేస్తున్నారనే చర్చ సాగుతోంది.


 

click me!