వైఎస్ జగన్ ని కలిసిన మంచు విష్ణు

Published : Feb 14, 2019, 03:46 PM ISTUpdated : Feb 14, 2019, 04:33 PM IST
వైఎస్ జగన్ ని కలిసిన మంచు విష్ణు

సారాంశం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని శుక్రవారం సినీ హీరో మంచు విష్ణు లోటస్ పాండ్ లో కలిశారు. 

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని గురువారం సినీ హీరో మంచు విష్ణు లోటస్ పాండ్ లో కలిశారు.  కాగా.. ఇప్పుడు వీరి కలయిక ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. విష్ణు జగన్ ని కలవడం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం మంచు విష్ణుకి పెద్దగా సినిమాలు ఏమీ లేవు. అంతే కాకుండా.. ఈ ఎన్నికల్లో సినీ గ్లామర్ ని ఎంతో కొంత వాడుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే విష్ణు.. జగన్ ని కలిసారా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అయితే.. మరికొందరు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు.

మంచు విష్ణుకి.. జగన్ బంధువు అవుతాడు. విష్ణు భార్య వెరోనికా.. జగన్ కి దగ్గరి బంధువు. ఈ కారణంగానే.. వైఎస్ కుటుంబంతో మంచు ఫ్యామిలీ రాకపోకలు సాగిస్తూ ఉంటుంది. గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా మోహన్ బాబు,విష్ణు వెళ్లి కలిసి వచ్చారు. ఇప్పుడు కూడా విష్ణు కాజ్యువల్ గా కలిసి ఉండొచ్చనే వాదనలు కూడా వినపడుతున్నాయి. మరి వీటిలో నిజమెంతో తెలియాలంటే.. అటు జగన్ కానీ.. ఇటు విష్ణు కానీ.. ఎవరో ఒకరు ప్రకటన చేయాల్సిందే. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్