
అమరావతి: అసెంబ్లీ నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించి స్కిన్ డిజైన్ న్ బాధ్యతలు సీఎం చంద్రబాబు నార్మన్ ఫోస్టర్ సంస్థకు అప్పగించారు. అయితే నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు అసెంబ్లీ స్కిన్ డిజైన్‌ను సీఎం చంద్రబాబుకు సమర్పించారు.
అయితే స్వల్ప మార్పులతో వచ్చేవారం పూర్తిస్థాయి డిజైన్లు జరుగుతాయని చంద్రబాబు తెలిపారు. నవంబర్ 30 కల్లా అసెంబ్లీ నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోందని సీఎం చెప్పారు.
తిరగబడిన లిల్లీ ఫ్లవర్ ఆకారంలో ఏపీ అసెంబ్లీ నిర్మాణం ఉంటుందని చంద్రబాబు తెలిపారు. 12.4 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో అసెంబ్లీ నిర్మాణం జరుగుతుందన్నారు. 250 మీటర్ల ఎత్తు, 200మీ. పొడవు, వెడల్పుతో అసెంబ్లీ నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు. అసెంబ్లీ టవర్‌లో రెండు గ్యాలరీలు, ర్యాంపు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.