రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ నివాసంలో ఇవాళ ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిం,ారు. . జగజ్జనని చిట్ ఫండ్ కేసులో ఎమ్మెల్యే నివాసంలో సోదాలు చేశారు.
రాజమండ్రి: జగజ్జనని చిట్ ఫండ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నివాసంలో సోమవారంనాడు ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇదే కేసులో ఇటీవలనే ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు వాసులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మామే ఆదిరెడ్డి అప్పారావు.
జగజ్జనని చిట్ ఫండ్ కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 30న ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు వాసులను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏపీ హైకోర్టులో ఈ నెల 3న ఆదిరెడ్డి అప్పారావు, వాసులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.ఈ బెయిల్ పిటిషన్లపై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు ఈ నెల 10న బెయిల్ మంజూరు చేసింది.
undefined
జగజ్జనని చిట్ ఫండ్ కేసులో మరింత సమాచారం కోసం ఆదిరెడ్డి అప్పారావు నివాసంలో ఇవాళ ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాజకీయ దురుద్దేశ్యంతో ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు వాసులను సీఐడీ అరెస్ట్ చేసిందని టీడీపీ ఆరోపణలు చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆదిరెడ్డి అప్పారావు, వాసులను చంద్రబాబునాయుడు ఇటీవల పరామర్శించిన విషయం తెలిసిందే .
also read:జగజ్జనని చిట్‌ఫండ్ కేసు:మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కొడుకు వాసుకు బెయిల్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. పార్టీ మారనందుకే భవానీ భర్త, మామపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.