
కాకినాడ జిల్లా (kakinada district) ప్రత్తిపాడులో టీడీపీ (tdp) నేత వరుపుల రాజా (varupula raja) అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. వరుపుల రాజా ఇంటిని చుట్టుముట్టారు సీఐడీ (ap cid) పోలీసులు. గతంలో లంపకలోవ సొసైటీలో నిధులు గోల్‌మాల్‌పై సీఐడీ కేసు నమోదైంది. ఈ కేసులో గతంలో వరుపుల రాజాకు హైకోర్టు (high court) బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వరుపుల రాజా ఇంటికి పోలీసులు వచ్చినట్లు తెలుసుకున్న టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు.
వరుపుల రాజా తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నుంచి 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనూహ్యంగా ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి.. తిరిగి రెండు నెలలకే సొంతగూటికి చేరుకున్నారు.
Also REad:తూర్పులో బాబుకు షాక్: టీడీపీకి వరుపుల రాజా గుడ్‌బై
రాజీనామా సమయంలో టీడీపీలో కాపులకు అన్యాయం జరుగుతోందని.. ఒకే సామాజిక వర్గానికి పదవులు, కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని రాజా ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీకి భవిష్యత్ లేదని, మునిగిపోయే నావలాంటిదని.. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. తాను పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డానని.. ఎన్నికల సమయంలో చివరి వరకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో టికెట్ ఇవ్వడం వల్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయానని వరుపుల రాజా చెప్పారు. పార్టీలో అవమానాలను తట్టుకోలేక రాజీనామా చేశానని తెలిపారు.