గుంటూరు: రఘురామను కోర్టులో హాజరుపరిచిన సీఐడీ పోలీసులు

Siva Kodati |  
Published : May 15, 2021, 05:01 PM IST
గుంటూరు: రఘురామను కోర్టులో హాజరుపరిచిన సీఐడీ పోలీసులు

సారాంశం

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు గుంటూరులోని ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అంతకుముందు సీఐడీ కార్యాలయంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. 

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు గుంటూరులోని ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అంతకుముందు సీఐడీ కార్యాలయంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. 

అంతకుముందు రఘురామకృష్ణంరాజుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. నేరుగా తమ వద్దకు రావడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. బెయిల్ కోసం తొలుత సెషన్స్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. దీనిపై దాదాపు 45 నిమిషాల పాటు హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి.

Also Read:లోపల రఘురామకృష్ణమ విచారణ: బయట అంబులెన్స్ రెడీ, ఏబీఎన్, టీవీ5లతో కలిసి కుట్ర

సెషన్స్ కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేయాలని హైకోర్టు సూచించింది. రఘురామ కృష్ణమరాజు వాదనలతో హైకోర్టు ఏకీభవించలేదు. రఘురామకృష్ణమ రాజు అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనకు కోవిడ్ వచ్చే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో కోవిడ్ నిబంధనల మేరకు రఘురామకృష్ణమ రాజును విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రస్తుత పరిస్థితిలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. 

గతంలో ఓ యూనివర్శిటీ వీసీ నేరుగా హైకోర్టుకు వెళ్లిన విషయాన్ని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. అయినప్పటికీ హైకోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేశారు కాబట్టి హైకోర్టుకు వచ్చామని రఘురామకృష్ణమ రాజు న్యాయవాది చెప్పారు. కుట్రపూరితంగా సిఐడి కేసు నమోదు చేసిందని, ఆధారాలు లేకుండా ఓ ఎంపీని అరెస్టు చేయడం సరి కాదని రఘురామకృష్ణమ రాజు న్యాయవాది అన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

సాయికృష్ణ ఇంటికి వద్ద జగన్ సంచలన ప్రెస్ మీట్ | YS Jagan Sensational Press Meet at Sai Krishna House
కృష్ణలంకలో గాదె సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన జగన్ | YS Jagan Visits Gade Sai Krishna Family